తెలుగులో తిరుగులేని మార్కెట్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్ ఆయన సొంతం. పదేళ్ల పాటు నిఖార్సయిన హిట్ ఒక్కటీ లేకపోయినా పవన్ ఫాలోయింగ్ చెక్కు చెదరలేదని ‘గబ్బర్ సింగ్’తో రుజువైంది. ఆ తర్వాత రిలీజ్‌కు ముందే పైరసీ అయినా సరే.. ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ తర్వాత కూడా టాక్‌తో సంబంధం లేకుండా, ప్రతికూల బాక్సాఫీస్ పరిస్థితుల్లోనూ పవన్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి.
రీమేక్ సినిమాలై ఉండి, పవన్ అభిమానులు ఆశించేంత హీరోయిజం లేకపోయినా సరే.. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ మంచి బజ్ తెచ్చుకున్నాయి. వాటికి ఆరంభ వసూళ్లు బాగానే వచ్చాయి. కాకపోతే.. పవన్ తమకు సినిమా ఛాన్సు ఇవ్వడమే మహా భాగ్యం అన్నట్లు భావించే నిర్మాతలు.. ఆయనకు పరిమితికి మించి పారితోషకం ఇస్తుండటం, మేకింగ్ మీద తక్కువ ఖర్చు పెట్టినా బడ్జెట్ పెరిగిపోతుండటం సమస్యగా మారుతోంది.
పవన్‌కు ‘వకీల్ సాబ్’ నుంచి రూ.50 కోట్లకు తక్కువ కాకుండా రెమ్యూనరేషన్ అందుతోంది. ఇక మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు కలిపితే అక్కడే ఖర్చు రూ.70-75 కోట్ల దాకా అయిపోతోంది. ఇక మేకింగ్ ఖర్చు 25-30 కోట్లు పెట్టుకున్నా బడ్జెట్ అలవోకగా రూ.100 కోట్లు దాటేస్తోంది. వరుసగా రీమేక్‌లే అయినప్పటికీ పవన్‌కున్న క్రేజ్ వల్ల వాటికి బిజినెస్ బాగానే అవుతోంది. వంద కోట్లు పెడుతున్న నిర్మాతలు దాని మీద 20-30 కోట్లు లాభాలు లక్ష్యంగా భారీ రేట్లకు సినిమాలను అమ్ముతున్నారు. థియేట్రికల్ బిజినెస్‌నే రూ.100 కోట్లు దాటించాలని చూస్తున్నారు. కానీ అంత రేటు పెట్టి సినిమాను కొంటున్న బయ్యర్లకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
కరోనా ప్రభావం, ఏపీలో టికెట్ల ధరల తగ్గింపు వల్ల ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ రికవరీపై బాగా ఎఫెక్ట్ పడింది. దీంతో సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా, ఓపెనింగ్స్ తెచ్చుకున్నా.. చివరికి కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇప్పుడు ‘బ్రో’ విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది. పవన్‌కు భారీ రెమ్యూనరేషన్ ఈ సినిమాను దక్కించుకున్న పీపుల్స్ మీడియా.. థియేట్రికల్ హక్కులను కూడా రూ.100 కోట్లకు పై రేటుతోనే అమ్మే ప్రయత్నంలో ఉంది. కానీ పవన్ గత రెండు చిత్రాలతో పోలిస్తే దీనికి బజ్ తక్కువ ఉంది. పైగా ఏపీలో మరోసారి ఈ సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో బయ్యర్లకు మళ్లీ భయాలు తప్పడం లేదు. మరి ‘బ్రో’ ఎలాంటి టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి.
This post was last modified on July 14, 2023 10:12 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…