Movie News

ఓప్పెన్ హెయిమర్ రివ్యూలు వచ్చేశాయ్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఓపెన్ హెయిమర్ ప్రీ రిలీజ్ ప్రీమియర్ రివ్యూస్ బయటికి వచ్చేశాయి. కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మీడియా ప్రతినిధులతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలకు స్పెషల్ షోలు వేశారు. ఎలాంటి విఎఫ్ఎక్స్ వాడకుండా మూడు గంటల నిడివి ఉన్న సినిమా తీశానని క్రిస్టోఫర్ నోలన్ చెప్పడం ఇతర ఫిలిం మేకర్స్ ని విస్మయానికి గురి చేసింది. పైగా ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మట్ తో షూట్ చేయడంతో పాటు దశాబ్దాల నాటి నెగటివ్ రీలు టెక్నాలజీ వాడటం మరో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ముందస్తు సమీక్షలు ఏమంటున్నాయి.

నోలన్ ఇప్పటిదాకా తీసినవాటిలో ఇదే అత్యంత ఘాఢత ఉన్న నేపథ్యం. కాకపోతే టెనెట్ లాగా కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే లేకుండా సులభంగా అర్థమయ్యేలా కథనాన్ని రూపొందించారు. లుడ్విగ్ గొరాన్ సన్  నేపధ్య సంగీత సంగీతం ప్రధాన హైలైట్స్ లో ఒకటి. సాంకేతికంగా క్రిస్టోఫర్ మరోసారి తన అత్యుత్తమ ప్రతిభను ఋజువు చేసుకున్నారు. చివరి అరవై నిముషాలు ఆడియన్స్ అందరితోనూ ఏకాభిప్రాయం వచ్చేలా మెప్పించలేకపోయినా మొదటి రెండు గంటలు మాత్రం నోలన్ ని ఇష్టపడని వాళ్ళు కూడా ప్రేమిస్తారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కు చోటు ఇవ్వలేదు.

సుదీర్ఘమైన డైలాగులున్న సీన్లు చాలా ఉన్నాయి. అర్థం చేసుకుంటే అబ్బురపడాల్సిందే. లేదంటే బోర్ కొట్టిస్తాయి. ఆర్టిస్టుల్లో ఎమిలీ బ్లంట్ తన పెర్ఫార్మన్స్ తో కట్టిపడేస్తారు. సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనేలు పోటాపోటీగా నటించారు. న్యూక్లియర్ విధ్వంసంని నేపథ్యంగా తీసుకున్న క్రిస్టోఫర్ నోలన్ దానికి రాజకీయ అంశాలను జోడించడం బాగుంది. ఇవన్నీ విదేశీయుల అనుభూతిని ఆధారంగా వచ్చిన ఫీడ్ బ్యాక్. మనకు ఇంకోలా అనిపించవచ్చు. ఇప్పటికే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ తో ట్రేడ్ కి షాక్ ఇస్తున్న ఓపెన్ హెయిమర్ ఇండియా వైడ్ థియేటర్లలో 21వ తేదీన గ్రాండ్ గా అడుగు పెట్టనుంది. 

This post was last modified on July 13, 2023 6:46 pm

Share

Recent Posts

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

2 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

4 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

5 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

5 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

5 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

6 hours ago