Movie News

రూమర్ పై రష్మిక ఫన్నీ రియాక్షన్

స్టార్ హీరోయిన్స్ పై ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. వీటిపై వారి రియాక్షన్ కూడా వివిధ రకాలుగా ఉంటుంది. తాజాగా హీరోయిన్ రష్మిక పై ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’ సినిమాతో పాటు నితిన్ వెంకీ కుడుముల సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. ఇటీవలే ఆమె ఈ సినిమా నుండి బయటికి వచ్చేసిందని ఓ వార్త బయటికొచ్చింది. దీనికి రెండు రీజన్స్ వినిపిస్తున్నాయి. అందులో ఒకటి రష్మిక డేట్స్ కారణం చేత ఈ సినిమా నుండి తప్పుకుందని అంటున్నారు, మరో రీజన్ తన పాత మేనేజర్ తో ఉన్న ఓ గొడవ కారణం చేత ఈ ప్రాజెక్ట్ ను రష్మిక వదులుకుంటుందని వినిపిస్తుంది.

తాజాగా రష్మిక ట్విటర్ లో నోరు మూసుకొని నవ్వుతూ ఓ రియాక్షన్ ఇచ్చింది. ఆ ఫోటోతో పాటు Just my reaction to a lot of things in general 🙊🐷😄❤️ అంటూ చెప్పుకుంది. ఇది చూస్తే రష్మిక తను నితిన్ సినిమా నుండి బయటికి వచ్చేసిందనే వార్తకి ఇచ్చిన రియాక్షన్ అనిపిస్తుంది. ఏదేమైనా రష్మిక ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ మీడియాలో రెగ్యులర్ గా వినిపిస్తుంది.

విజయ్ తో రిలేషన్ షిప్ , మేనేజర్ తో గొడవ ఇలా పలు సార్లు వార్తల్లో నిలిచింది. ఇప్పుడు నితిన్ -వెంకీ కుడుముల సినిమా నుండి అవుట్ అనే ఇన్సైడ్ వార్తతో మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. వెంకీ కడుముల డైరెక్షన్ లో రష్మిక నటిస్తున్న మూడో సినిమా ఇది. వెంకీ డైరెక్ట్ చేసిన మొదటి సినిమాతోనే రష్మిక తెలుగులో పరిచయమైంది. ఈ ఇద్దరు తర్వాత భీష్మ తో మరో సూపర్ హిట్ అందుకున్నారు. సొ రష్మిక ఈ సినిమా నుండి తప్పుకుందని వస్తున్న వార్తల్లో నిజం లేకపోవచ్చు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

This post was last modified on July 13, 2023 7:41 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

1 hour ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

2 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

2 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

2 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

5 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

5 hours ago