ఆర్ఆర్ఆర్ తర్వాత ఆలస్యం చేయకుండా గేమ్‌ఛేంజర్ సినిమాను మొదలుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దాని తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులైంది. ఆ తర్వాత ఏ అప్‌డేట్ లేదు. ఐతే ఈ సినిమా టీం నుంచి వరుస అనౌన్స్‌మెంట్లు రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చరణ్ 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడని చాన్నాళ్ల ముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సమాచారమే నిజమని తేలిపోయింది.
స్వయంగా రెహమానే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాకు తాను పని చేస్తున్నానని.. ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఉన్నానని రెహమాన్ తెలిపాడు. ఉప్పెన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు బుచ్చిబాబు. ఆ సినిమా ఒక దశలో ఖరారైంది కూడా. అప్పుడే రెహమాన్‌తో అతను సంగీత చర్చలు మొదలుపెట్టాడు. కానీ తర్వాత తారక్‌కు వేరే కమిట్మెంట్లు ఉండటంతో బుచ్చిబాబు సినిమా నుంచి వైదొలిగాడు.
తారక్‌తో చేయాలనుకున్న కథో, మరొకటో కానీ.. చరణ్‌తో బుచ్చిబాబు సినిమాను ఓకే చేసుకున్నాడు. హీరో మారినా.. సంగీత దర్శకుడిగా మాత్రం రెహమాన్‌నే పెట్టుకోవాలని అతను ఫిక్సయ్యాడు. ఈ చిత్రంలో ఉప్పెన విలన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించనుండగా.. జాన్వి కపూర్ కథానాయికగా ప్రచారంలో ఉంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని.. చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని.. చరణ్ ఇందులో స్పోర్ట్స్ మన్ టర్న్డ్ కోచ్‌గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on July 13, 2023 12:09 am
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…