రెండు రోజుల క్రితం విడుదలైన జవాన్ ట్రైలర్ రెస్పాన్స్ చూసి షారుఖ్ ఖాన్ ఆనందం మాములుగా లేదు. హీరోగా, నిర్మాతగా దీని మీద కోట్ల రూపాయల పెట్టుబడిని మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశాడు. అది కూడా ఒక తమిళ డైరెక్టర్ ని నమ్ముకుని. అయితే అది వమ్ముకాకుండా అంతకంతా అంచనాలు పెరుగుతుండటంతో బిజినెస్ కూడా క్రేజీగా జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షారుఖ్ అక్కడ నయనతార భర్త విగ్నేష్ శివన్ పెట్టిన కంగ్రాట్స్ ట్వీట్ కు స్పందనగా పంచులు వేయడం ఫ్యాన్స్ మధ్య వైరల్ గా మారింది. బాద్షా సెన్స్ అఫ్ హ్యూమర్ మరోసారి బయటపడింది.
ముందు ట్వీట్ చేసిన విగ్నేష్ బాలీవుడ్ డెబ్యూ సందర్భంగా దర్శకుడు, మిత్రుడు అట్లీకి శుభాకంక్షలు చెప్పాడు. అలాగే భార్య నయనతార హిందీ తెరంగేట్రం షారుఖ్ ఖాన్ తో జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. దానికి పఠాన్ హీరో స్పందిస్తూ నయన్ అద్భుతమని, కానీ ఇది నేనెవరికి చెబుతున్నాను, ఆల్రెడీ ఆమె గురించి సంపూర్ణంగా తెలిసిన తెలిసిన వ్యక్తికేగా. మొగుడా జరా భద్రం, మీ ఆవిడ ఇప్పుడు కొన్ని ఫైట్లు స్టంట్లు నేర్చుకుందని హెచ్చరించాడు. జవాన్ కోసం షూటింగ్ ముందే ట్రైనింగ్ తీసుకున్న విషయాన్ని ఇలా ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించాడన్న మాట.
మొత్తానికి షారుఖ్ పంచులు బాగా పేలాయి. జవాన్ మొత్తం తమిళ నటీనటులే కనిపిస్తున్న నేపథ్యంలో దీనికి కోలీవుడ్ ఫ్యాన్స్ సపోర్ట్ గట్టిగా దక్కుతోంది. దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెన్నైలో చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన జవాన్ లో దీపికా పదుకునే స్పెషల్ క్యామియో చేసింది. అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. కంటెంట్ పరంగా కొన్ని హిట్ సినిమాల పోలికలు కనిపిస్తున్నప్పటికీ మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో అట్లీది ప్రత్యేక శైలి. అందుకే జవాన్ హక్కులు భాషతో సంబంధం లేకుండా అమ్ముడుపోతున్నాయి
This post was last modified on July 13, 2023 12:03 am
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…
క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత…
అప్పుడెప్పుడో...2008లో దాయాది దేశం పాకిస్తాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించింది. అదే ఏడాది పాక్ ఉగ్రవాదులు ముంబై ఫై…
ఇంకో రెండు రోజుల్లో పుష్ప 2 ది రూల్ రీ లోడెడ్ వెర్షన్ ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ తో…
ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడమనే సంప్రదాయం 2023లో మైత్రి సంస్థ విజయవంతంగా…