నందమూరి అభిమానులు ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతున్న మోక్షజ్ఞ వెండితెర ప్రవేశం గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. పూరి జగన్నాధ్ పేరు తొలుత వినిపించింది. ఆ తర్వాత బోయపాటి శీను ఒక కథ సిద్ధం చేశారని ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ గాసిప్స్ రూపంలో తిరుగుతున్నాయి తప్పించి ఫలానా సమయంలో టాలీవుడ్ ఎంట్రీ చేయిస్తారనే క్లారిటీ మాత్రం రాలేదు. ఇటీవలే జరిగిన నాసా సభలకు అతిథిగా వెళ్లిన బాలకృష్ణ అక్కడి ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల వారసుడి రాక గురించి కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు తెలిసింది.
దాని ప్రకారం వచ్చే ఏడాది ఆదిత్య 369 సీక్వెల్ ని తన దర్శకత్వంలోనే మొదలుపెట్టి, అందులో మోక్షజ్ఞకి కీలకమైన పాత్ర ఇస్తానని, హీరో తనే అయినప్పటికీ దానికి సమానంగా కొడుక్కి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారట. అయితే సోలోగా కాకుండా ఇలా చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఆరా తీస్తే దానికో లాజిక్ ఉందట. బాలయ్య మొదటి చిత్రం తాతమ్మ కల దర్శకుడు స్వయానా తండ్రి ఎన్టీఆరే. ఆ సెంటిమెంట్ బ్రహ్మాండంగా పండి తర్వాత క్రమంగా స్టార్ గా ఎదగడానికి దోహదపడింది. కెరీర్ తొలినాళ్ళలో బాలకృష్ణ నాన్న డైరెక్షన్లో చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు
ఈ లెక్కన మోక్షజ్ఞని స్క్రీన్ మీద చూడాలంటే 2025 దాకా ఆగక తప్పేలా లేదు. కొద్దిరోజుల క్రితం బాగా సన్నబడిన మోక్షజ్ఞ లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కథానాయకుడిగా కనిపించాల్సిన ఫిట్ నెస్ వచ్చేసిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. తగినంత శిక్షణ మరోసారి తీసుకుని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి మోక్షజ్ఞని లాంచ్ చేయాలనే ప్లాన్ కు కొంత టైం అయితే పట్టేలా ఉంది. ఆదిత్య 999కు కథ సిద్ధంగానే ఉందట. ఫస్ట్ పార్ట్ తీసిన సింగీతం శ్రీనివాసరావు దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకుని పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేయించే పనిని బాలయ్య త్వరలోనే మొదలుపెట్టొచ్చు.
This post was last modified on July 12, 2023 8:25 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…