రేపు రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లకు రెడీ అవుతున్న బేబీ మీద అంచనాలు మెల్లగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ ఛార్ట్ బస్టరయ్యాక యువతకు దగ్గరయ్యింది. ట్రైలర్ చూశాక ట్రయాంగిల్ లవ్ తో దర్శకుడు సాయి రాజేష్ తమనే టార్గెట్ గా పెట్టుకుని తీశారని అర్థం చేసుకుని అడ్వాన్స్ బుకింగ్స్ ని బాగానే పరిగెత్తిస్తున్నారు. మూడు గంటలకు పది నిమిషాల తక్కువ నిడివితో ఈ మధ్య కాలంలో ఇంత సుదీర్ఘ లవ్ స్టోరీ రాలేదన్నది వాస్తవం. కంటెంట్ మీద అంత నమ్మకం ఉండబట్టే లెన్త్ గురించి సీరియస్ గా పట్టించుకోకుండా విడుదలకు రెడీ చేశారు.
ఇప్పుడు అందరి కన్ను వైష్ణవి చైతన్య మీదే ఉన్నాయి. ఎందుకంటే టైటిల్ రోల్ బేబీ తనదే. సోషల్ మీడియా ట్రెండ్స్ యాప్స్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు తను పరిచయం ఉంది కానీ సామాన్య ప్రేక్షకులకు మాత్రం అల వైకుంఠపురములో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన అమ్మాయంటేనే వెంటనే గుర్తుపడతారు. అంతకు ముందు వరుడు కావలెను, టక్ జగదీష్ లాంటి సినిమాల్లో చేసినా అంతగా గుర్తింపు రాలేదు. యూట్యూబ్ లో కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు బాగా పేరు తీసుకొచ్చాయి. అయితే ఇవన్నీ రీచ్ పరంగా అందరికీ చేరినవి కావు. బేబీనే మొదటి బ్రేక్ ఇవ్వాలి.
అప్ కమింగ్ స్టేజిలో ఇలాంటి ప్రాజెక్టు దక్కడం, అందులోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ రావడం లక్కే. యూనిట్ చెబుతున్నట్టు నిజంగా బేబీ కనక హిట్టు కొడితే కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ల ప్రేమలో నలిగిపోయే అమ్మాయిగా కథ మొత్తం తన చుట్టే తిరిగే పెద్ద పాత్ర ఇచ్చారు. మెప్పించడమూ పరీక్షే. పైగా మెయిన్ ట్విస్ట్, క్లైమాక్స్ చాలా షాకింగ్ గా ఉంటాయని అంటున్నారు. అంచనాలకు తగ్గట్టు బేబీ ఉంటే కనక డల్ గా ఉన్న బాక్సాఫీస్ వద్ద తిరిగి జోష్ చూడొచ్చు. సామజవరగమన తర్వాత మళ్ళీ అంతటి హిట్టు బొమ్మ పడలేదు
This post was last modified on July 12, 2023 8:23 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…