ప్రపంచవ్యాప్తంగా టామ్ క్రూజ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురు చూసిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టేసింది. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో వచ్చిన ఆరు భాగాలు దేనికవే సూపర్ హిట్ కావడంతో కొత్త దాని మీద మాములు అంచనాలు లేవు. ట్రైలర్, మేకింగ్ వీడియోలు చూశాక మొదటిరోజే చూడాలని డిసైడ్ అయిన వాళ్ళు కోట్లలో ఉన్నారు. దానికి తగ్గట్టే ఇండియాలోనూ గ్రాండ్ రిలీజ్ దక్కింది. బుధవారం కావడంతో తగినన్ని థియేటర్లు లభ్యమయ్యాయి. ఇంతకీ ఎంఐ 7 హైప్ ని మించేలా అలరించిందా లేదా ఓ లుక్ వేద్దాం
సముద్రగర్భంలో మునిగిపోయిన ఒక సబ్ మెరైన్ లో ప్రపంచ వినాశనానికి తయారు చేసిన ఒక రహస్యం ఉంటుంది. దాన్ని తెరవాలంటే రెండు భాగాలున్న ఒక తాళం చెవి కావాలి. అది వెతికే బాధ్యతను ప్రభుత్వ అధికారులతో పాటు హంట్(టామ్ క్రూజ్) తీసుకుంటాడు. యుద్ధం కోసం దాన్ని వాడాలన్న పంతం ఉన్న కొందరు దుర్మార్గుల నుంచి దాన్ని తప్పించేందుకు గ్రెస్(హైలీ యాట్ వెల్) సహాయం తీసుకుంటాడు. అయితే ఎన్నో ప్రమాదాలు చుట్టుముడతాయి. చివరికి ఇద్దరు కలిసి కీ సంపాదిస్తారు. కానీ మెరైన్ కు వెళ్లే దారి తెలియదు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది.
ముప్పాతిక శాతం సినిమా హై వోల్టేజ్ తో నడిచే ఎంఐ7 ని మంచి యాక్షన్ ఎపిసోడ్స్, ఉత్కంఠభరిత సన్నివేశాలతో నింపేశారు. వీర ఫ్యాన్స్ కి ఇవన్నీ బ్రహ్మాండంగా నచ్చుతాయి. కథ పరంగా ఆశించడానికి ఎక్కువ లేకపోయినా ఫైట్లు, ఛేజులు, సాహసాలు అబ్బురపరుస్తాయి. అయితే బాగా హైప్ తీసుకొచ్చిన కొండ మీద టామ్ క్రూజ్ దూకే ట్రైన్ షాట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. తర్వాత వచ్చే సీన్లు గొప్ప థ్రిల్ ఇస్తాయి. నిడివి ఎక్కువయ్యింది. మునుపటి భాగాలను మించేలా లేదు కానీ ఎంఐ 7 నిరాశపరచకుండా, ఆడియన్స్ కి పైసా వసూల్ అయితే అనిపిస్తుంది
This post was last modified on July 12, 2023 5:09 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…