తమిళనాాట రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడ ప్రస్తుతం నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్.. రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తుండటం అందుకు కారణం. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కొన్నేళ్లుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టడం.. రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో విజయ్ వెనక్కి తగ్గాడు.
సినిమా వాళ్లలోనే వేర్వేరు పార్టీలు ఉంటే.. పెద్ద శక్తిగా ఎదగడం కష్టం అవుతుందన్న ఉద్దేశమే విజయ్ వెనుకంజ వేయడానికి కారణమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కమల్ పెట్టిన పార్టీ ఇప్పుడు సోదిలో లేదు. రజినీకాంత్ పార్టీయే పెట్టకుండా తాను రాజకీయాలకు దూరం అనేశారు. మరో టాప్ హీరో అజిత్‌కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు.
మొత్తంగా సినీ పరిశ్రమ తరఫు నుంచి గ్రౌండ్ క్లియర్‌గా ఉంది. విజయ్‌కి పోటీయే లేదు. మరోవైపు జయలలిత ఉన్నంత వరకు తిరుగులేని స్థాయిలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ.. తర్వాత బలహీన పడుతూ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలపడింది. ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అధికార డీఎంకే ఆధిపత్యమే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీటైన పార్టీ వస్తే దానికి స్కోప్ ఉంటుంది. ఈ అవకాశాన్ని విజయ్ ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అతను పార్టీ పెడతాడనే ప్రచారం జోరుగా నడుస్తోంది.
ఈ దిశగా విజయ్ ప్రణాళికా బద్ధంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అతను అభిమానులతో సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ పెట్టడం మీదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలు పూర్తిగా మానేస్తానని విజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అంతే కాక ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు త్వరలోనే తాను పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు కూడా విజయ్ వెల్లడించాడట. ఈ వార్త ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. విజయ్ పట్టుదలతో, ప్రణాళికతో రంగంలోకి దిగితే బలమైన రాజకీయ శక్తిగా ఎదగగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 12, 2023 2:24 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…