లాక్ డౌన్‍కి ముందు రకుల్ ప్రీత్ సింగ్ డిమాండ్‍లో లేదు. చిన్న సినిమాలకు కూడా ఆమెను కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫామ్‍లో వుండగానే సడన్‍గా అవకాశాలు కోల్పోయింది. నెమ్మదిగా కనిపించకుండా పోయింది. తమిళ చిత్రాలు, హిందీ సినిమాలు కొన్ని చేసినా కానీ తెలుగునాట వచ్చిన పాపులారిటీ ఆమెకి మరెక్కడా రాలేదు.
అందుకే లాక్ డౌన్ టైమ్‍లో మిగిలిన హీరోయిన్లు ఇప్పట్లో సెట్స్కి రాలేమంటూ నిర్మాతలకు చెప్పేస్తున్న తరుణంలో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‍కి మకాం మార్చేసింది. ఆమె అనుకున్నట్టుగానే ఈ మూవ్ భలేగా వర్కవుట్ అయింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడి చిత్రంలో కథానాయికగా అవకాశం వచ్చింది. క్రిష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యువ హీరో సరసన సీనియర్ ఎందుకు అనుకోకుండా, రకుల్ ప్రీత్ సింగ్ వల్ల పుల్ పెరుగుతుందని ఆమెను ఫిక్స్ చేసేసారు.
అలాగే నితిన్ ‘చెక్’లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మరోసారి నాగ చైతన్యతో జత కట్టనుందని కూడా వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ తీసే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. కేవలం లోకల్‍గా వచ్చేసి, అందుబాటులో వుండడమే కాకుండా పారితోషికం పరంగా పట్టువిడుపులు వుండడం రకుల్‍కి ప్లస్ అవుతోంది.
This post was last modified on August 14, 2020 9:50 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…