Movie News

తెలంగాణ ట్రెండు పట్టుకున్న భోళా

రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచే కొద్దీ సినిమాల్లో తెలంగాణ సెంటిమెంటు, ట్రెండుని ఫాలో కావడం మాత్రం గత కొన్నేళ్లలో బాగా పెరిగింది. నైజామ్ వేషభాషలతో ప్రత్యేకంగా పాత్రలు, పాటలు డిజైన్ చేయిస్తున్నారు. దసరా, బలగం లాంటివి ఎన్నింటికో స్ఫూర్తినిచ్చాయి . పరేషాన్, మేం ఫేమస్, ఇంటింటి రామాయణం ఇదే దారిలో నడిచివవే. ఇంకా జనం దృష్టిలో పడకుండా థియేటర్లకు వచ్చి వెళ్ళినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ కూడా పబ్లిక్ పల్స్ ని అనుసరించి ఆగస్ట్ 11 విడుదల కాబోయే భోళా శంకర్ లో ట్రెండుకి ఓటేశారు

ఇవాళ జామ్ జామ్ జజ్జనక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. దాదాపు క్యాస్టింగ్ మొత్తం ఈ పాటలో ఉంది. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ లతో పాటు చిన్నా చితక పెద్ద ఆర్టిస్టులందరూ ఇందులో భాగమయ్యారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ సెలెబ్రేషన్ సాంగ్ మెల్లగా మాస్ కు ఎక్కేలా మంచి బీట్స్ తో సాగింది. అసలు విశేషం అది కాదు. మధ్యలో నర్సాపెల్లే గండిలోన గంగధారి అంటూ యూట్యూబ్ సెన్సేషన్  కనకవ్వతో పాటు సింగర్ మంగ్లీ పాడిన అచ్చ తెలంగాణ బ్లాక్ బస్టర్ పాటని ఇక్కడ వాడేశారు. వీళ్లిద్దరి ఒరిజినల్ వెర్షన్ ఇప్పటిదాకా 316 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది.

అంతగా జనానికి ఎక్కేసిన కనకవ్వ మంగ్లీలను భోళా శంకర్ లో మంచి టైమింగ్ తో వాడేశాడు దర్శకుడు మెహర్ రమేష్.  థియేటర్ లో దీనికి ప్రత్యేకంగా రెస్పాన్స్ ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.చిరంజీవి పాత్ర కూడా అదే స్లాంగ్ లో ఉంటుందని టీజర్ లో ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు కాబట్టి దానికి తగ్గట్టుగానే కంపోజ్ చేయించారు. టైటిల్ ట్రాక్ కన్నా ఇదే కాస్త బెటర్ గా అనిపిస్తోంది. వినడానికి రెగ్యులర్ గా ఉన్నా విజువల్ గా కలర్ఫుల్ గా ఉంది. ఆల్బమ్ లో ఇంకో మూడు పాటలు ఉన్నాయి. సరిగ్గా నెలలో రాబోతున్న భోళా శంకర్ ఫలితం గురించి టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది

This post was last modified on July 11, 2023 5:32 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

40 seconds ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

21 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago