టాలీవుడ్లో చాలా వేగంగా సినిమాలు చేసే స్టార్ హీరోల్లో నాని ఒకడు. ఈ ఏడాది వేసవిలో మాస్ మూవీ ‘దసరా’తో మంచి ఫలితాన్నందుకున్న నాని.. ఏడాది చివర్లో దీనికి పూర్తి భిన్నమైన ఒక క్లాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది.
చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘హలో డాడీ’ అనే పేరును ఈ సినిమాకు ఖరారు చేసే అవకాశాలున్నాయట. ‘హాయ్ డాడీ’, ‘డియర్ డాడీ’ లాంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ‘హలో డాడీ’నే క్యాచీగా ఉంటుందని.. అదే ఫైనలైజ్ కావచ్చని అంటున్నారు. ఈ సినిమా తండ్రి-కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో సాగనుంది. ఒక ఎమోషనల్ జర్నీలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
నాని కూతురి పాత్రలో కియారా ఖన్నా అనే చిన్నారి నటిస్తోంది. ఈ సినిమా ప్రి టీజర్ చూస్తేనే ఇది తండ్రీ కూతుళ్ల కథ అని అర్థమైపోయింది. కథా కథనాలు హృధ్యంగా.. గుండెల్ని హత్తుకునేలా ఉంటాయని.. ఈ చిత్రంతో నాని ప్రేక్షకులను ఏడిపించేయడం ఖాయమని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘డాడీ’ తరహాలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. కథానాయిక కంటే కూతురి పాత్రే సినిమాలో కీలకమట.
అందుకే సినిమాకు ‘హలో డాడీ’ టైటిల్ పెట్టాలని చూస్త్తున్నారు. ఇంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్‌లో భాగస్వామిగా ఉన్న మోహన్ చెరుకూరి ఇప్పుడు కొత్తగా ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ అనే బేనర్ పెట్టి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విజేందర్ రెడ్డి, మూర్తి కూడా ఇందులో భాగస్వాములు. ‘ఖుషి’తో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారట.
This post was last modified on July 11, 2023 5:28 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…