సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్లు.. ఇక్కడి సినిమాల గురించి కౌంటర్లు వేస్తుంటారు. అలాగే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా కూడా తరచుగా ఇక్కడి సినిమాలు, ఇండస్ట్రీ గురించి కొంచెం తక్కువ చేసే మాట్లాడుతోందన్న విమర్శలు ఉన్నాయి. బాలీవుడ్లో తనకు వ్యతిరేకంగా కొన్ని గ్యాంగ్స్ తయారయ్యాయని.. తనను దెబ్బ కొట్టడానికి వాళ్లు ప్రయత్నించారని.. అందుకే బాలీవుడ్‌ను వదిలేసి హాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చిందని ఆమె గతంలో వ్యాఖ్యానించడం బాలీవుడ్ వర్గాల్లో దుమారం రేపింది.
ఇక ఈ మధ్యే తాను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడలేదని.. అందుకు తనకు ఖాళీ దొరకలేదని ప్రియాంక వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసేందుకు ప్రియాంకకు ఖాళీ దొరకలేదా అంటూ ఆమె మీద పంచులు వేశారు నెటిజన్లు. కట్ చేస్తే ఇప్పుడు ప్రియాంక భారతీయ సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం గురించి కౌంటర్లు వేసినట్లుగా విమర్శలు ఎదుర్కొంటోంది.
ఆమె ఇటీవల ఒక అంతర్జాతీయ సినీ వేడుకలో తనను ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయికి భారతీయ సినిమాల్లో డ్యాన్సులు ఎలా ఉంటాయో చేసి చూపించింది. ఇండియన్ సినిమాలంటే నడుము.. ఎదభాగమే అని పేర్కొంటూ ఇక్కడి సినిమాల్లో స్టెప్స్ ఎలా ఉంటాయో చేసి చూపించింది. ప్రియాంక క్యాజువల్‌గానే ఇలా చేసినట్లు అనిపించినా.. ఆమె ఇండియన్ సినిమాలను కించపరిచేలా ప్రవర్తించిందని.. ఎంత హాలీవుడ్లో బిజీ అయినా కూడా ఇంత వెటకారం పనికిరాదని ఆమె మీద నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రియాంక నటించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’ కొన్ని నెలల కిందటే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 11, 2023 4:59 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…