మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ పై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా నుండి తమన్ అవుట్ అనే వార్త కూడా ఈ మధ్య గట్టిగా వినిపించింది. అయితే దాని గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా సెటైర్ వేస్తూ ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు తమన్. తాజాగా బ్రో సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా గుంటూరు కారం గురించి మాట్లాడాడు.
సినిమా నుండి నన్ను తీసేస్తే ప్రొడ్యూసర్ చెప్తారు కదా, అంతా బాగానే ఉంది. కానీ ఏవేవో రాస్తున్నారు. అందరూ ఆ సినిమా మీదే పడ్డారెందుకో అర్థం కావట్లేదు అంటూ తమన్ రియాక్ట్ అయ్యాడు. ఇక క్రికెట్ మీద ఫోకస్ తో సాంగ్స్ టైమ్ కి ఇవ్వడం లేదనే ప్రశ్న కూడా తమన్ కి ఎదురైంది. అలాంటిదేం లేదని తమన్ చెప్పుకున్నాడు. తనకి గర్ల్ ఫ్రెండ్స్ లేరు , ఎలాంటి ఇతర వ్యాసనాలు లేవని , కేవలం క్రికెట్ ఒక్కటే తనకి ఎమోషన్ అంటూ తెలిపాడు.
అది కూడా రాత్రి వేళ రిలాక్స్ కోసం స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆడుతానని అన్నాడు. పని పక్కన పెట్టేసి క్రికెట్ ఆడటం లేదని చెప్పాడు. తాజాగా రిలీజయిన బ్రో లో మై డియర్ మార్కండేయ సాంగ్ రెస్పాన్స్ గురించి చెప్తూ తనకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పాడు. సినిమాలో మరో మూడు సాంగ్స్ ఉంటాయని , అలాగే ప్రమోషనల్ సాంగ్ ఉంటుందని , వారానికి ఒక సాంగ్ చొప్పున రిలీజ్ చేస్తామని తమకి టైమ్ లేదని తెలిపాడు.
This post was last modified on July 10, 2023 6:20 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…