‘ఆదిపురుష్’తో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు.. త్వరగానే కోలుకున్నారు. అందుక్కారణం.. ‘సలార్’ సందడి మొదలైపోవడమే. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కావడం.. ఇది ప్రభాస్ ఇమేజ్‌కు, కటౌట్‌కు తగ్గ పక్కా మాస్ బొమ్మ కావడంతో వారిలో ఉత్సాహం నింపుతోంది. ఈసారి ప్రభాస్ బ్లాక్ బస్టర్ మిస్సయ్యే ఛాన్సే లేదని అభిమానులు ధీమాగా ఉన్నారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. పక్కాగా ఆ డేట్‌కు సినిమా రాబోతోందని ఇటీవల టీజర్‌తో స్పష్టం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ల విషయంలో చిత్ర బృందం పక్కా ప్లానింగ్‌తోనే అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో ట్రైలర్ కూడా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఐతే సెప్టెంబరు 28 ‘సలార్’ రిలీజ్‌కు సరైన డేటేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సెప్టెంబరు 19న వినాయక చవితి రాబోతోంది. దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో నిమజ్జనం జరిగే రోజే ‘సలార్’ రిలీజ్ కాబోతోంది. ఇది సినిమా వసూళ్ల మీద కొంత ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. జనమంతా రోడ్ల మీద ఉండే ఆ రోజుల్లో ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా కష్టమవుతుంది. మామూలు సినిమాలైతే పర్వాలేదు కానీ.. ‘సలార్’ లాంటి భారీ అంచనాలున్న సినిమా అదే రోజు రిలీజైతే మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెం కూడా రావచ్చు.
ఎన్నో ఆంక్షల మధ్య ఆ రోజు షోలు వేయడం.. జనాలను థియేటర్లకు రప్పించడం కూడా కష్టమవుతుంది. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో హైదరాబాద్‌లో ఫేమస్ మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్‌ను పూర్తిగా మూసేస్తారు కూడా. ‘సలార్’ లాంటి సినిమా రిలీజైనపుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ల్‌లో షోలు పడకపోవడం అన్నది హైదరాబాదీ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ముందు లేదా వెనకటి వారానికి సినిమాను వాయిదా వేయాలనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 9, 2023 3:13 pm
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…