సరిగ్గా ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న బ్రో పాటల హంగామా మొదలైపోయింది. చెప్పినట్టుగా ప్రకటించిన టైంకే ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ పవన్ ఫ్యాన్స్ అటాక్ ని తప్పించుకుంది. మై డియర్ మార్కండేయ మంచి మాట చెబుతా రాసుకో అంటూ గబ్బర్ సింగ్ డైలాగ్ ని పాట రూపంలో మార్చారు రచయిత రామజోగయ్య శాస్త్రి. తమన్ కంపోజింగ్ మంచి కూల్ బీట్ తో, పవన్ కళ్యాణ్ స్వాగ్ ఎప్పటిలాగే అభిమానులను మెస్మరైజ్ చేసేలా ఉండగా, మధ్యలో సాయి ధరమ్ తేజ్ స్టెప్పులు కాసింత హుషారునిచ్చేలా సాగాయి.
ఊర్వశి రౌతేలా ఆడిపాడిన ఈ స్పెషల్ సాంగ్ పబ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. సమయం మనిషి రూపంలో కిందికి వచ్చినప్పుడు జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో చూపించడానికి తేజుని అక్కడికి తీసుకొస్తుంది. ఆ సందర్భంగా వచ్చే సాంగ్ ఇది. క్యాచీ పదాలతో సాగిపోయింది. మధ్యలో కొంత క్లాసిక్ టచ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం ఇంపాక్ట్ తగ్గించినా ఓవరాల్ గా చూసుకుంటే విజువల్ గా ఫ్యాన్స్ స్టఫ్ అయితే కనిపించింది. వినోదయ సితం రీమేక్ గా రూపొందుతున్న బ్రోకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే చాలా మార్పులు చేశారు
ఇప్పటిదాకా వచ్చిన వాటిలో టీజర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడీ మార్కండేయ సాంగ్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి. బిజినెస్ పరంగా వంద కోట్ల దాకా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయని అంటున్నారు కానీ అదెంత వరకు నిజమో కన్ఫర్మ్ కాలేదు. గోపాల గోపాల తరహాలో ఇందులోనూ పవన్ కళ్యాణ్ కి జోడి ఉండదు. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుందా లేక కొంత భాగానికే పరిమితం చేస్తారానేది తెలియాల్సి ఉంది. ఇంటర్వెల్ ఎంట్రీ అనే ప్రచారం జరుగుతోంది కానీ నలభై నిమిషాల లోపే పవన్ వస్తాడని వినికిడి. ట్రైలర్ వచ్చాక స్పష్టత పెరుగుతుంది.
This post was last modified on July 8, 2023 5:38 pm
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…