తనకే కాదు నిర్మాత కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నాగ శౌర్య చాలా ధీమాగా చెప్పిన రంగబలి ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో రాలేదన్న మాట వసూళ్ల రూపంలో కళ్ళముందు కనిపిస్తోంది. టాక్ అటుఇటుగా ఉండటం, రివ్యూలు అంతంత మాత్రంగా రావడంతో ఫైనల్ స్టేటస్ ఏమంత ఆశాజనకంగా ఉండబోవడం లేదన్నది ట్రేడ్ మాట. సరే ఫైనల్ స్టేటస్ కి ఇంకా టైం ఉంది కానీ భలే బ్లాక్ బస్టర్ పేరుతో టీమ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగశౌర్య ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా బయట పడిపోయింది. సెకండ్ హాఫ్ విషయంలో వచ్చిన విమర్శలను అంగీకరించడానికి ఇష్టపడలేదు.
కొన్ని లాజిక్స్, డీటెయిల్స్ మిస్ అవ్వడం గురించి స్పందిస్తూ అన్ని చూపిస్తూ పోతే రంగబలిని పదహారు గంటలు తీయాల్సి వస్తుందని ఇక బాహుబలి ఇంకెన్ని సంవత్సరాలు తీయాలో అంటూ అసహనం వ్యక్తం చేసి అక్కడితో ముంగించేసి వెళ్లిపోవడం కెమెరా సాక్షిగా రికార్డైపోయింది. ఇదొక్కటే కాదు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో దర్శకుడు పవన్ బసంశెట్టి సైతం బెస్ట్ ఎంటర్ టైనర్ తీశామని చెప్పడానికి నానా పాట్లు పడ్డ వైనం స్పష్టంగా కనిపించింది. ఇలా మీడియాని పిలిచి ప్రత్యక్ష ప్రసారంలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పెట్టినప్పుడు అన్నింటికి ప్రిపేరయ్యే ఉండాలి.
రంగబలికి ఈ వీకెండ్ చాలా కీలకం కానుంది. శని ఆదివారాలు వీలైనంత రాబట్టుకుంటే బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కు దగ్గరవుతారు. కానీ ఆ స్థాయి కలెక్షన్లు లేవు కాబట్టి ప్రమోషన్ ని ఇంకేదయినా క్రియేటివ్ గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారం మంచి బజ్ తో బేబీ రిలీజ్ ఉంది. దాంతో పాటు మహావీరుడు, నాయకుడు వస్తున్నాయి. ఇవి కాకుండా మిషన్ ఇంపాజిబుల్ ఉండనే ఉంది. సో రంగబలి వాటి మధ్య నెగ్గుకురావాలంటే ఈపాటికి సామజవరగమన టాక్ వచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఛలో రేంజ్ అని శౌర్య పదే పదే చెబుతున్నాడు కానీ చివరికి ఎక్కడ నిలుస్తుందో చూడాలి
This post was last modified on July 8, 2023 3:54 pm
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…