టాలీవుడ్లో ఇప్పుడు ఎటు చూసినా వారసులదే హవా. ఒకప్పుడు హీరోల కొడుకులే హీరోలయ్యేవాళ్లు కానీ.. ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు, టెక్నీషియన్ల పిల్లలు కూడా హీరోలైపోతున్నారు. ఇండియాలోనే మేటి సంగీత దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న కీరవాణి కూడా తన చిన్న కొడుకు సింహా కోడూరిని హీరోను చేశాడు.
కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకుడైతే.. సింహా మాత్రం హీరో అయ్యాడు. వీళ్లిద్దరూ ‘మత్తు వదలరా’ అనే సినిమాతో ఒకేసారి తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం. ఈ చిత్రంతో నటుడిగా సింహా.. సంగీత దర్శకుడిగా కాలభైరవ తమ ప్రతిభను చాటుకున్నారు. ఇద్దరికీ మంచి డెబ్యూ దక్కింది. అరంగేట్రానికి ఇలాంటి సినిమాను ఎంచుకోవడం పట్ల ప్రశంసలు కూడా దక్కాయి. ఇద్దరికీ మంచి భవిష్యత్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సంగీత దర్శకుడిగా కాలభైరవ కెరీర్ బాగానే ముందుకు సాగుతోంది. కలర్ ఫొటో, కార్తికేయ-2 లాంటి చిత్రాలు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ సింహా మాత్రం డెబ్యూ సినిమా తర్వాత తడబడుతున్నాడు. సినిమా సినిమాకూ కిందికి పడిపోతున్నాడు. ‘తెల్లవారితే గురువారం’ అనే కామెడీ సినిమాతో అతడికి ద్వితీయ విఘ్నం తప్పలేదు. ఆ తర్వాత ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే సినిమా అయితే వచ్చింది వెళ్లింది కూడా తెలియదు.
ఓ హాలీవుడ్ మూవీ ఆధారంగా ఆ చిత్రాన్ని ఓటీటీ టార్గెట్‌గానే తీశారు. దాని సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు సింహా ‘భాగ్ సాలే’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ చూస్తే మంచి ఎంటర్టైనర్ లాగా కనిపించింది కానీ.. సినిమా చూసిన వాళ్లకు మాత్రం ‘సినిమా’ కనిపించింది. ఇంత లో క్వాలిటీ సినిమాను సింహా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. అతనెవరో అనామకుడైతే ఓకే కానీ.. రాజమౌళి లాంటి మేటి దర్శకుడి కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఇలాంటి సినిమాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సింహా సొంతంగా ఎదగాలన్న ఉద్దేశంతో సినిమాల ఎంపికలో ఛాయిస్ అతడికే వదిలేస్తున్నారేమో కానీ.. అతను చేస్తున్న పేలవమైన సినిమాల వల్ల తన కెరీర్ దెబ్బ తినడమే కాదు.. రాజమౌళి ఫ్యామిలీ హీరో ఇంత లో క్వాలిటీ సినిమాలు చేయడమేంటి అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. సినిమాల ఎంపికలో రాజమౌళి, కీరవాణి కొంచెం సలహాలు ఇవ్వాలని.. మొత్తం మేకింగ్ అంతా పర్యవేక్షించకపోయినా కథ విని ఓకే, నాట్ ఓకే చెప్పడం.. రష్ చూసి కరెక్షన్లు చెప్పడం లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే సింహా కెరీర్ క్లోజ్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు.
This post was last modified on July 8, 2023 3:38 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…