దేశం గర్వించదగ్గ లెజెండరీ నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. దేశంలో అతి పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయిన బాలీవుడ్లో ఆయన తిరుగులేని స్టార్. బాలీవుడ్లో ఆయనకు ముందు, వెనుక సూపర్ స్టార్లు ఉన్నప్పటకీ అమితాబ్ అనుభివించిన స్టార్ డమ్ ఎవరూ అందుకోలేనిది. 80 ఏళ్లకు చేరువ అవుతూ కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తూ.. అద్భుతమైన పాత్రలతో అలరిస్తున్నారు అమితాబ్.
అలాంటి నటుడు ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాడంటే అందుకు మొత్తం ఇండస్ట్రీ గర్విస్తుంది. అంత గొప్ప నటుడు ఒక తెలుగు చిత్రంలో నటించినందుకు.. ఒక తెలుగు స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు తన జన్మ ధన్యమైనట్లుగా వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రాజెక్ట్ కే సినిమా, ప్రభాస్‌ల గురించి మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ప్రాజెక్ట్ కే సినిమా టీంకు.. ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్ ఈ సినిమాలో భాగమైనందుకు అమితానందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ వేశారు. తన ఇంగ్లిష్ ట్వీట్‌తో పాటు ఆయన తెలుగు టెక్స్ట్ కూడా పోస్ట్ చేయడం విశేషం. తెలుగు సినిమా మరియు దాని ఆరాధ్యదైవం ప్రభాస్ కీర్తిలో ఉండాలనే గౌరవం మరియు గొప్ప అధికారాన్ని పొందడం.. నేను ధన్యుడిని అని మాత్రమే చెప్పగలను.. వారి వినయం, వారి గౌరవం, వారి శ్రద్ధ చాలా హత్తుకునే మరియు భావోద్వేగం.
నా కోసం కాదు, ‘ప్రాజెక్ట్ K’లో పాలుపంచుకున్న వారి కోసం, మీరు పడిన కష్టాన్ని వర్ధిల్లాలని మరియు కొత్త క్షితిజాలను పొందాలని కోరుకుంటున్నాను అని అమితాబ్ పేర్కొన్నారు. ఇంగ్లిష్ టెక్స్ట్ ను ఎవరో గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసినట్లున్నారేమో అనువాదం సరిగా లేదు కానీ.. అమితాబ్ ఇలా తెలుగు ట్వీట్ వేయడం.. ప్రభాస్‌ను కొనియాడటం మాత్రం తెలుగు వారికి ఆనందాన్నిచ్చే విషయమే.
This post was last modified on July 8, 2023 8:11 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…