సౌత్ నాలుగు భాషల సినీ పరిశ్రమల్లో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందున్న పేరు ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పేది అనిరుద్ రవిచందర్ గురించే. కోలీవుడ్ లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్ లలోనూ మాములుగా లేదు. అటు పాటలు, ఇటు నేపధ్య సంగీతం రెండింటిలోనూ అదరగొట్టే ఈ యువ తరంగం చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇటీవలే తనవి రెండు ఆడియో సింగల్స్ బయటికొచ్చాయి. ఒకటి విజయ్ లియో, రెండు రజనీకాంత్ జైలర్. మిలియన్ల వ్యూస్ వెల్లువలా వచ్చి పడ్డాయి కానీ ట్యూన్స్ మరీ ఎక్స్ ట్రాడినరీగా లేవని మ్యూజిక్ లవర్స్ రిపోర్ట్.
సరే మనకొచ్చిన చిక్కేమనుకుంటున్నారా. అనిరుద్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చేస్తున్నాడు. ఇంకా కంపోజింగ్ పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. ప్రాథమికంగా కొంత వర్క్ చేశారు కానీ అతని డేట్ల కోసం దర్శకుడు కొరటాల శివ వెయిటింగ్ లో ఉన్నాడు. వాటి రికార్డింగ్ పూర్తయ్యాకే సాంగ్స్ షూట్ ప్లాన్ చేసుకోవాలి. ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు ఉండటంతో దేవర సంగీతం విషయంలో రాజీ పడేందుకు హీరో, డైరెక్టర్ ఇద్దరూ సిద్ధంగా లేరు. అనిరుద్ గతంలో అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ లాంటివి చేసినా కూడా అవేవి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లా నిలవలేదు.
రెండోది విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూని కాంబోలో చేస్తున్నది. ఖుషి అయ్యాక విజయ్ దేవరకొండ ఇందులో పాల్గొంటాడు. పరశురామ్ తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్(ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణతో పాటు ఇది కూడా సమాంతరంగా జరుగుతుంది. గౌతమ్ తో ఆల్రెడీ జెర్సికి పని చేసిన అనిరుద్ ఈసారి ఎలాంటి స్కోర్ ఇస్తాడోనని రౌడీ హీరో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు అనిరుద్ కి తమిళ ప్రాజెక్టులకే టైం చాలడం లేదు. అలాంటప్పుడు ఇక్కడ చెప్పిన రెండింటికి క్వాలిటీ సమయం ఇవ్వడం పెద్ద టాక్. ఒకరకంగా చెప్పాలంటే అది సదరు దర్శకులకే ఛాలెంజ్. ఎలా రాబట్టుకుంటారో మరి.
This post was last modified on July 7, 2023 2:33 pm
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యల మధ్య కూడా దేశం కోసం తన బాధ్యతలను నిర్వర్తించిన వైనం నిజంగా…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఉన్న గ్యాప్‌ను దాదాపు తగ్గించుకునే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ…
ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్స్టాస్ మధ్య…
ఇటీవలే విడుదలైన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నిర్మాత చెప్పినట్టు పుష్ప 2 గ్రాస్ ని దాటేంత రేంజ్ లో ఆ…
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన 'విజన్-2020' - అందరికీ తెలిసిందే. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీనికి…