రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ నుంచి దుకాణం ఎత్తేసి దశాబ్దం దాటుతోంది. ఒకప్పుడు రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి గొప్ప సినిమాలతో బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా.. పదుల సంఖ్యలో నటీనటులను, టెక్నీషియన్లను పరిచయం చేసిన వాడిగా.. ఎన్నో గొప్ప ప్రయోగాలు చేసిన వాడిగా వర్మకు చాలా మంచి పేరుండేది. కానీ తర్వాతి కాలంలో నాసిరకం సినిమాలు తీసి, ఇండస్ట్రీ జనాలతో కయ్యం పెట్టుకుని అక్కడ తన ప్రాభవం కోల్పోయాడు.
వర్మ సినిమా అంటే ఎవరూ పట్టించుకోని పరిస్థితి వచ్చాక ముంబయి నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయాడు. వర్మను అక్కడి మీడియా కూడా లైట్ తీసుకుంది. వర్మ తీసిన క్లాసిక్స్ మీద స్పెషల్ స్టోరీలు చేస్తూ.. అతడి బైట్ కూడా తీసుకోకుండా ఆయా సినిమాల్లో భాగమైన మిగతా వారితో మాట్లాడి సరిపెట్టే పరిస్థితి వచ్చిందంటే వర్మను అక్కడి మీడియా ఎంత తేలిగ్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. మీడియాలో చీకటి కోణాల్ని ఎక్స్‌పోజ్ చేస్తూ వర్మ ‘రణ్’ సినిమా తీయడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.
గతం సంగతి వదిలేస్తే వర్మ టాలీవుడ్‌కు వచ్చి ఇంకెంతగా పతనం అయ్యాడో.. ఎలాంటి నాసిరకం సినిమాలు తీశాడో అందరికీ తెలిసిందే. ఇక్కడి జనాలు కూడా వర్మను మరీ తేలిగ్గా తీసుకునే, ఆయన్ని విపరీతంగా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆయన అనౌన్స్ చేస్తున్న, తీస్తున్న సినిమాల స్థాయి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలాంటి టైంలో వర్మ రూటు మార్చి జాతీయ స్థాయిలో టాప్ జర్నలిస్టుల్లో ఒకడు, అత్యంత వివాదాస్పదుడు అయిన అర్నాబ్ గోస్వామి మీద ఫోకస్ పెట్టాడు. సుశాంత్ మృతి విషయంలో బాలీవుడ్ మీద నిందలు మోపుతూ మిగతా అంశాలన్నింటనీ పక్కన పెట్టి అదే పనిగా స్టోరీలు చేస్తుండటం వర్మకు ఆగ్రహం తెప్పించి ముందుగా ట్వీట్లు గుప్పించాడు.
ఇప్పుడేమో ఏకంగా అర్నాబ్.. ది న్యూస్ ప్రాస్టిటూట్ పేరుతో సినిమానే అనౌన్స్ చేశాడు. వర్మ ఒక పదేళ్ల ముందు ఇలాంటి సినిమా అనౌన్స్ చేస్తే ఆ కథే వేరుగా ఉండేది. సెన్సేషన్ అయ్యేది. తన ఛానెల్లో న్యూస్ రూం డిస్కషన్లకు వచ్చే అతిథులు ఎంతటి వారైనా చూడకుండా.. వాళ్లకు ఛాన్సే ఇవ్వకుండా నోరేసుకుని పడిపోయే అర్నాబ్ మీద చాలామందికి కోపం ఉంది. ఆయన్ని టార్గెట్ చేస్తూ తీసే సినిమాను చాలామంది ఎంజాయ్ చేసే అవాకశమూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు అండ అర్నాబ్‌కు ఉందని, భాజపాకు అనుకూలంగా రిపబ్లిక్ నడుచుకుంటుందని అందరికీ తెలుసు.
ఇలాంటి బలమైన పర్సనాలిటీ మీద సినిమా అనౌన్స్ చేయడం ద్వారా వర్మ తన దమ్ము చూపించాడు. ఇంత కాలానికి వర్మ సరైన వాడిని టార్గెట్ చేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాకపోతే ఈ పని వర్మ ఇలా పూర్తిగా విలువ కోల్పోయిన సమయంలో కాకుండా, కొన్నేళ్ల ముందు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేటుగా అయినా సరే.. తాను తెలుగులో చేస్తున్న నాసిరకం సినిమాల స్టయిల్లో కాకుండా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఈ సినిమా తీస్తే ఇదొక సెన్సేషన్ కావచ్చు.
This post was last modified on August 14, 2020 3:15 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…