ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి. ఎప్పట్నుంచో ఊరిస్తున్న ‘సలార్’ టీజర్ ఎట్టకేలకు ఈ రోజు విడుదలైంది. ఇప్పటిదాకా ఏ పెద్ద సినిమాకూ లేని విధంగా తెల్లవారుజామున 5.12 గంటలకు టీజర్ లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది చిత్ర బృందం. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు కచ్చితంగా ఓ పెద్ద సక్సెస్ ఇస్తుందని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా కావడంతో అలారాలు పెట్టుకుని మరీ నిద్ర లేచి ఆ సమయంలో టీజర్ చూశారు అభిమానులు. కానీ వారి అంచనాలను టీజర్ అందుకోలేకపోయింది. ఇంత కష్టపడి నిద్ర లేచి చూస్తే.. కనీసం ప్రభాస్ ముఖం కూడా సరిగా చూపించలేదే అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కొందరికి టీజర్ నచ్చినప్పటికీ.. మెజారిటీ ప్రేక్షకులు దీని విషయంలో నిరాశనే వ్యక్తం చేస్తున్నారు.
‘సలార్’ టీజర్ వచ్చాక ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కూడా ఈ సినిమాకు సంబంధించినవే కావడం విశేషం. ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం హంగామా ఉండటం కామన్. ఐతే ఈ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్‌లో టాప్‌లో ఉన్నది నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ కావడం గమనార్హం. #Disappointed.. ఇదీ ఈ ఉదయం నుంచి ఇండియా లెవెల్లో టాప్2లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.
దాన్ని క్లిక్ చేస్తే ‘సలార్’ టీజర్‌కు సంబంధించిన పోస్టులే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ చివరి సినిమా ‘కేజీఎఫ్-2’ టీజర్‌తో పోల్చుకుని.. ‘సలార్’ టీజర్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందులో పావు వంతు కిక్ కూడా ‘సలార్’ టీజర్ ఇవ్వలేదని వాళ్లు అంటున్నారు. ఇదేమీ ‘గ్లింప్స్’ కాదు కదా.. అలాంటపుడు ప్రభాస్‌ను కనిపించీ కనిపించనట్లు చూపించడం ఏంటి.. దీన్ని టీజర్ అని ఎలా అంటారు అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు ఇది ‘సలార్’ టీజర్ కాదు.. ‘కేజీఎఫ్-3’ టీజర్ అంటూ కౌంటర్లు వేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఐతే ఈ టీజర్ వల్ల సినిమా మీద హైప్ అయితే తగ్గే పరిస్థితి లేదు. ట్రైలర్ బావుంటే చాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఓపెనింగ్స్ పక్కా.
This post was last modified on July 6, 2023 7:04 pm
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…