ఇద్దరు హీరోలకు టెన్షన్ టెన్షన్

ఈ శుక్రవారం ఎనిమిదికి పైగానే కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్నవి రంగబలి, భాగ్ సాలే మాత్రమే. మిగిలినవి తమ శక్తి మేరకు పబ్లిసిటీ చేసుకుంటున్నాయి కానీ జనాలకు ఇంకా రీచ్ కాలేదు. అదిరిపోయిందనే టాక్ వస్తేనే ఓపెనింగ్స్ గురించి ఏమైనా ఆశలు పెట్టుకోవచ్చు. ఉన్నంతలో రుద్రంగి మీద మాస్ కన్నేశారు.

అయితే ఇమేజ్ ఉన్న హీరో కాకుండా కేవలం జగపతి బాబు ప్రధాన పాత్రతో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కథను నడిపించడం ఎంత మేరకు ఫలితం ఇస్తుందో చూడాలి. అందుకే ఫ్రైడే థియేటర్ కు వెళ్లనిదే లోటుగా ఫీలయ్యే ఆడియన్స్ ముందు చెప్పిన రెండింటికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

రంగబలికి సంబంధించి నాగశౌర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఛలో తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ మళ్ళీ పడలేదు. యావరేజ్, ఫ్లాఫులే పడ్డాయి. అందుకే ఈసారి పూర్తిగా ఎంటర్ టైన్మెంట్ ప్లస్ కమర్షియల్ మసాలాకు దిగిపోయాడు. ట్రైలర్ కంటెంట్, కమెడియన్ సత్య ఇంటర్వ్యూ యూత్ ని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. మొదటి షోనే హౌస్ ఫుల్స్ పడకపోయినా సామజవరగమన లాగా పికప్ మీద యూనిట్ గంపెడాశలతో ఉంది. ఇక భాగ్ సాలే సంగతి చూస్తే శ్రీసింహా కోడూరికి మత్తు వదలరా తర్వాత మళ్ళీ బ్రేక్ దొరకలేదు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త రెండూ బోల్తా కొట్టాయి.

ఇప్పుడీ భాగ్ సాలే ఆడితేనే తర్వాత ఉస్తాద్ కి మంచి బిజినెస్ జరుగుతుంది. అది కూడా నెల గ్యాప్ లో ఆగస్ట్ లోనే వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు రిలీజయ్యే  సినిమా మార్కెట్ లెక్కలను బయ్యర్లు బేరీజు వేసుకుంటారు. కీరవాణి, రాజమౌళి సపోర్ట్ తీసుకునే అవకాశమున్నా  కుర్రాడు సోలోగానే ఫైట్ చేస్తున్నాడు. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన భాగ్ సాలే క్లాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంది. రంగబలి, భాగ్ లు సాలే ఫలితాల గురించి  హీరోలే కాదు ట్రేడ్ వర్గాలు కూడా నమ్మకం పెట్టుకున్నారు. రెండో వారం సామజవరగమన స్ట్రాంగ్ గా ఉన్నా టాక్ ని బట్టి కొత్త వాటి డామినేషన్ ఆధారపడి ఉంటుంది