మాములుగా స్టార్ హీరో కొత్త సినిమా రిలీజ్ రోజు తెల్లవారుఝామున లేవడం లేదా అలారం పెట్టుకోవడం సహజం. దశబ్దాలుగా ఎన్నో చూశాం. అయితే ఒక టీజర్ కోసం అభిమానులు రాత్రంతా ఎదురు చూసి ఎప్పుడు ఉదయం అయిదు దాటుతుందాని ఎదురు చూడటం మాత్రం ఒక్క సలార్ విషయంలోనే జరిగింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా వరస వైఫల్యాల తర్వాత ప్రభాస్ కి సరైన బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఫ్యాన్స్ దీని మీదే నమ్మకం పెట్టుకున్నారు. ముఖ్యంగా కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన మూవీ కావడంతో హైప్ కి హద్దులు లేకుండా పోతోంది.
టీజర్ మొత్తం నిమిషంన్నర ఉన్నా అందులో తొంభై శాతం ఎలివేషన్ కే సరిపోయింది. సీనియర్ ఆర్టిస్టు టినూ ఆనంద్ తనను చంపడానికి చుట్టుముట్టిన గ్యాంగ్ ని ఉద్దేశించి పులి, సింహం, చిరుత ఇవన్నీ అడవిలో ప్రమాదకరం కానీ జురాసిక్ పార్క్ లో కాదని సలార్ గురించి హింట్ ఇస్తాడు. అంటే డైనోసార్ ముందు ఏదైనా దిగదుడుపే అనే తరహాలో ఆ పాత్ర తాలూకు స్వభావాన్ని పరిచయం ఇస్తాడు. అయితే ప్రభాస్ ఫేస్ ని పూర్తిగా రివీల్ చేయకుండా కేవలం సైడ్ కట్ తో సరిపెట్టడం కొంత నిరాశ పరిచింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శనం మాత్రం ఫుల్లుగా జరిగింది.
ఇది సలార్ మొదటి భాగం మాత్రమే. సీజ్ ఫైర్ ట్యాగ్ పెట్టారు. అంటే సీక్వెల్ ఉందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. విజువల్స్ అధిక శాతం కెజిఎఫ్ నే పోలి ఉన్నప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఒకరకమైన ఇంటెన్సిటీ చూపించే ప్రశాంత్ నీల్ ఇందులో అంతకు మించి ఏదో చూపించబోతున్నాడు. రవి బస్రూర్ నేపధ్య సంగీతం అంచనాలకు తగ్గట్టే ఎలివేట్ చేసింది. నిజానికి సలార్ వీడియో నుంచి చాలా ఆశించిన మూవీ లవర్స్ ని నిరాశ పరిచింది. కనీసం ప్రభాస్ ని రివీల్ చేసి ఒక డైలాగు చెప్పించినా అరాచకం నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఒక రకంగా దీన్ని ప్రీ టీజర్ గా తీసుకోవాలి. సెప్టెంబర్ 28న సలార్ థియేటర్లలో రానుంది.
This post was last modified on July 6, 2023 6:13 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…