యువ కథానాయకుడు నిఖిల్ కొత్త సినిమా ‘స్పై’ విడుదలకు కొన్ని రోజుల ముందు నిర్మాతకు, హీరోకు విభేదాలు నెలకొన్నట్లుగా కొన్ని వార్తలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథాంశం దృష్ట్యా.. సినిమాను పకడ్బందీగా తీర్చిదిద్ది, సరిగ్గా ప్రమోట్ చేస్తే ‘కార్తికేయ-2’ లాగే జాతీయ స్థాయిలో సత్తా చాటగలదని నిఖిల్ నమ్మాడు. అందుకోసం ఇంకా సమయం కావాలని.. రిలీజ్ వాయిదా వేయాలని అతను భావిస్తే.. నిర్మాత మాత్రం ముందు అనుకున్నట్లే జూన్ 29న రిలీజ్‌కు రెడీ అయిపోయాడు.
కొన్ని రోజుల స్తబ్ధత తర్వాత నిఖిల్ తగ్గి వచ్చాడు. నిర్మాత ఇష్టప్రకారమే జూన్ 29న సినిమా రిలీజైంది. ఐతే ముందున్న బజ్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ కంటెంట్ వీక్ కావడంతో తర్వాత సినిమా నిలబడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే అంతగా ఆడని ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మినిమం సౌండ్ చేయలేకపోయింది.
‘కార్తికేయ-2’తో అనుకోకుండా కలిసి వచ్చిన పాన్ ఇండియా మార్కెట్‌ను నిఖిల్ ఉపయోగించుకోలేకపోయాడనే అభిప్రాయాలు కలిగాయి. ఈ నేపథ్యంలోనే నిఖిల్ తన పాన్ ఇండియా ఫ్యాన్స్‌ను క్షమాపణ కోరుతూ ఒక నోట్ రిలీజ్ చేశాడు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 50 రోజుల లోపు ఓటీటీకి ఇస్తే పీవీఆర్ సహా కొన్ని నేషనల్ మల్టీప్లెక్స్ ఛైన్స్ ఆ సినిమాలను తమ స్క్రీన్లలో ప్రదర్శించట్లేదు. ‘స్పై’ నెల రోజులకే ఓటీటీలో వచ్చేలా ఒప్పందం జరగడంతో ఈ సినిమా మల్టీప్లెక్సుల్లో షోలు మిస్సయింది.
దీనికి తోడు కంటెంట్ సరైన సమయానికి డెలివరీ కాకపోవడంతో ఓవర్సీస్‌లో చాలా షోలు రద్దయ్యాయి. ఇవి సినిమా వసూళ్లపై బాగానే ప్రభావం చూపాయి. సిినిమాకు వచ్చిన ఓవరాల్ వసూళ్లు చూస్తే.. నిఖిల్ ‘కార్తికేయ-2’ వల్ల కొత్తగా ఏం మార్కెట్ సంపాదించాడనే ప్రశ్నలు తలెత్తాయి. ఐతే సినిమా ఆడకపోవడానికి అసలు కారణం కంటెంట్ వీక్ కావడం కాగా.. వేరే కారణాలు కూడా తోడై వసూళ్లు మరీ తక్కువ రావడంతో అది తర్వాతి సినిమాలకు ఇబ్బందిగా మారుతుందని భావించి నిఖిల్ నోట్ రిలీజ్ చేశాడు. నిజానికి ‘స్పై’ కంటే తన తర్వాతి సినిమాలు స్వయంభు, కార్తికేయ-2ల మీద నిఖిల్ పాన్ ఇండియా ఆశలు ఎక్కువగా పెట్టుకున్నాడు. అందుకే అవెక్కడ దెబ్బ తింటాయో అని ఇలా నోట్ రిలీజ్ చేశాడు.
This post was last modified on %s = human-readable time difference 7:54 pm
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…