బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తో గత ఏడాది మర్చిపోలేని విజయాన్ని అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈసారి మరో డిఫరెంట్ సబ్జెక్టుతో వస్తున్నాడు. డెవిల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో లక్కీ చార్మ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రెగ్యులర్ కమర్షియల్ సూత్రాలకు దూరంగా ఏదో కొత్తగా ట్రై చేయాలని చూస్తున్న కళ్యాణ్ రామ్ సెలక్షన్ మరోసారి బయటపడింది. నిమిషంలోపే ఉన్న టీజర్ ని హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
స్వాతంత్రం రాక ముందు బ్రిటిషర్లకు సీక్రెట్ ఏజెంట్ గా పని చేస్తుంటాడు డెవిల్(కళ్యాణ్ రామ్). అతని పేరు, రూపు రేఖలు ఎవరికీ తెలియదు. కళ్ళముందు విస్ఫోటనం బద్దలైనా ఎలాంటి హావభావాలు కనిపించకుండా చాణిక్యతను ప్రదర్శించడం గూఢచారి ప్రధాన లక్షణమని డెవిల్ నమ్ముతాడు. అయితే దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెల్ల దొరల కోసం ఎందుకు పని చేశాడు, దాని వెనుక ఉన్న రహస్య మిషన్ ఏంటి తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే స్క్రీన్ పై వచ్చే దాకా వేచి చూడాలి. కళ్యాణ్ రామ్ గెటప్, బాడీ లాంగ్వేజ్ అప్పటి కాలానికి తగ్గట్టు ప్రత్యేకంగా ఉన్నాయి.
విజువల్స్ గట్రా మరో ప్రామిసింగ్ కంటెంట్ అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. బడ్జెట్ భారీగానే ఖర్చు పెట్టారు. ప్యాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఇలాంటి సినిమాల పట్ల ప్రేక్షకులు మంచి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో కళ్యాణ్ రామ్ టేస్ట్ కు తగ్గట్టే మరో హిట్టు కొట్టే కళ స్పష్టంగా కనిపిస్తోంది. కథ,స్క్రీన్ ప్లే, మాటలు శ్రీకాంత్ విస్సా అందించగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సౌందర్ ఎస్ రాజన్ ఛాయాగ్రహణం సమకూర్చారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై గ్రాండియర్ గా రూపొందిన డెవిల్ త్వరలోనే విడుదల చేయబోతున్నారు. డేట్ ఎప్పుడనేది ఇంకా ప్రకటించలేదు.
This post was last modified on July 5, 2023 12:19 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…