ఎంతో నమ్మకంతో విపరీతమైన ప్రమోషన్లు చేసిన స్పై నిఖిల్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కావాల్సినంత యాక్షన్ ఉన్నప్పటికీ కథనంలో లోపాల వల్ల ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. దానికి తోడు హడావిడిగా 29నే రిలీజ్ చేయాలని నిర్మాత గట్టిగా పట్టుబట్టడంతో అది కూడా కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అయితే ముందుగా చెప్పినట్టు స్పై మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ జరగలేదు. అంతే కాదు కంటెంట్ సరైన సమయానికి చేరకపోవడం వల్ల ఓవర్సీస్ ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయి. వీటన్నిటికి కలిపి నిఖిల్ ట్విట్టర్ వేదికగా ఒక లెటర్ ద్వారా సారీ చెప్పాడు.
దాని సారాంశం ఇలా ఉంది. నా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చేలా చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద ఉంచిన నమ్మకానికి ఎంతో సంతోషంగా ఉంది. కానీ అన్ని భాషల్లో విడుదల చేయడంలో మా బృందం విఫలమైనందుకు బాధగా ఉంది. దేశవ్యాప్తంగా కాంట్రాక్టు, కంటెంట్ డిలే వల్ల షోలు రద్దయ్యాయి. ఓవర్సీస్ లోనూ 350 ప్రీమియర్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. హిందీ, కన్నడ, మలయాళం, తమిళ ప్రేక్షకులను ఈ విషయంగా క్షమాపణ కోరుతున్నాను. నా రాబోయే మూడు సినిమాలు టైం ప్రకారం అన్నీ పక్కాగా సిద్ధం చేసుకుని అన్ని భాషల్లో రిలీజవుతాయి.
ప్రతి తెలుగు సినిమా అభిమానికి ఇకపై నాణ్యత విషయంలో ఎంత ఒత్తిడి వచ్చినా రాజీ పడనని తెలియజేస్తున్నాను. ప్రతిదీ చెక్ చేసుకుని, పూర్తి సంసిద్ధంగా సినిమా తయారైనప్పుడే మీ ముందుకు వస్తాను. మొత్తానికి నిఖిల్ చాలా హుందాగా స్పై పరిణామాల పట్ల సారీ చెప్పడం అభిమానులనే కాదు నెటిజెన్లను సైతం ఆకట్టుకుంటోంది. కార్తికేయ 2తో వచ్చిన ప్యాన్ ఇండియా సక్సెస్ ని నిలబెట్టుకునే క్రమంలో స్పై లాంటి స్పీడ్ బ్రేకర్లు ఎంతైనా ఇబ్బంది పెట్టేవే. హిట్టు ఫ్లాపు ఎవరికైనా సహజమే కానీ ఇలా రిలీజ్ రోజు షోలు పడకపోవడం ఒకరకంగా మరక లాంటిది. అందుకే నిఖిల్ ఓపెన్ అయిపోయాడు
This post was last modified on July 5, 2023 10:27 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…