వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న శ్రీ విష్ణు హీరో.. తెలుగు వాళ్లకు పరిచయమే లేని మోనికా రెబ్బా అనే అమ్మాయి కథానాయిక. ఓటీటీలో రిలీజైన ఒక సినిమా అనుభవం ఉన్న రామ్ అబ్బరాజు దర్శకుడు.. వరుస డిజాస్టర్లతో సతమతం అవుతున్న అనిల్ సుంకర నిర్మాత.. ఇలాంటి కలయికలో, తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సామజవరగమన అనే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంతటి సంచలనం రేపుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
పాజిటివ్ టాక్‌కు తోడు బాక్సాఫీస్ దగ్గర కూడా పరిస్థితులు బాగా కలిసి రావడంతో ఈ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దిశగా అడగులు వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ చిత్రం షేర్ రూ.10 కోట్లకు చేరువగా షేర్ రాబట్టడం విశేషం. ఫుల్ రన్లో సినిమా ఏపీ, తెలంగాణల్లోనే రూ.15 కోట్ల దాకా షేర్ రాబట్టేలా ఉంది. ఇక యుఎస్‌లో ఈ సినిమా సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ సినిమా యుఎస్ హక్కులు అమ్మే సమయానికి పెద్దగా బజ్ లేదు. కేవలం రూ.30 లక్షలకే హక్కులు అమ్మేశారట. ఇప్పుడు చూస్తే ఈ సినిమా ఆల్రెడీ హాఫ్ మిలియన్ మార్కును దాటేసి మిలియన్ డాలర్ క్లబ్బు వైపు పరుగులు పెడుతోంది. వీకెండ్ అయ్యాక కూడా సినిమా జోరు తగ్గట్లేదు.
బుధవారం వీక్ డేలో సినిమా లక్ష డాలర్లకు పైగా వసూళ్లు రాబడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ వారం కొత్త సినిమాలకు బజ్ తక్కువే కావడంతో రెండో వీకెండ్లో కూడా సామజవరగమన దుమ్ము దులపబోతోంది. అలవోకగా మిలియన్ డాలర్ మార్కును అందుకోబోతోంది. అంటే 8 కోట్ల దాకా గ్రాస్ రాబట్టబోతోందన్నమాట. ఎక్కడ 30 లక్షల పెట్టుబడి.. ఎక్కడ 8 కోట్ల ఆదాయం. దీన్ని బట్టే సినిమా యుఎస్‌లో ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on July 5, 2023 1:20 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…