మంచు మోహన్ బాబు నట వారసుల్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది మంచు మనోజే. నేను మీకు తెలుసా, బిందాస్, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంటు తీగ లాంటి సినిమాలతో అతను ఒకప్పుడు యూత్‌లో మంచి క్రేజే సంపాదించాడు. కానీ తర్వాత వరుస ఫెయిల్యూర్లు, తనకు నప్పని సినిమాల వల్ల అతను వెనుకబడిపోయాడు. కెరీర్లో బాగా గ్యాప్ కూడా వచ్చేసింది.
ఇప్పుడు మళ్లీ తన స్టయిల్లో వాట్ ద ఫిష్ అనే క్రేజీ మూవీ ఒకటి చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా.. మనోజ్ గురించి ఇప్పుడో ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. అతను కెరీర్లో తొలిసారిగా విలన్ పాత్ర చేయబోతున్నాడన్నదే ఆ వార్త. అది కూడా రవితేజ సినిమాలో కావడం విశేషం. కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్.. మాస్ రాజాతో తీయబోయే చిత్రంలో మనోజ్‌ను విలన్‌గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ చిత్రంలో విశ్వక్సేన్ కూడా ఒక హీరోగా నటిస్తాడట. చాలా క్రేజీగా కనిపిస్తున్న కాంబినేషన్ ఇది. ముఖ్యంగా మనోజ్ విలన్ అనగానే అందరిలోనూ క్యూరియాసిటీ వస్తోంది. మనోజ్ చేసిన కొన్ని క్యారెక్టర్లు.. వాటిలో తన అగ్రెషన్ చూస్తే విలన్ పాత్రలకు బాగా సూటవుతాడని అనిపిస్తుంది. పైగా మనోజ్ తండ్రి మోహన్ బాబు విలన్‌గా ఎంత గొప్ప పాత్రలు చేశాడో.. ఎంత పేరు సంపాదించాడో తెలిసిందే. మోహన్ బాబుకు దగ్గరగా ఉండే వాచికంతో మనోజ్ కూడా విలనీని బాగా పండించగలడనే అభిప్రాయాలున్నాయి.
సరైన క్యారెక్టర్ పడి.. అతను బాగా పెర్ఫామ్ చేస్తే మోత మోగిపోవడం ఖాయం. విలన్ పాత్ర చేయడానికి మనోజ్ ఒప్పుకున్నట్లయితే అతను మంచి నిర్ణయిం తీసుకున్నట్లే. హీరోగా చేస్తూనే అప్పుడప్పుడూ ప్రతినాయక పాత్రలు చేస్తే తన రేంజే మారిపోవడం, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం ఖాయం.
This post was last modified on July 5, 2023 1:08 am
జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…
పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…
ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…
నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…
జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…