లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న లియోలో రామ్ చరణ్ చిన్న క్యామియో చేశాడన్న వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇది నిజమా కాదాని చెప్పడానికి టీమ్ సిద్ధంగా లేదు. పోనీ ఖండించేస్తే ఒక పనైపోతుందనుకుంటే రోజుకో పుకారు పుట్టిస్తారు కాబట్టి అన్నిటికి వివరణ ఇచ్చుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అందుకే మౌనం వహించడం తప్ప మరో మార్గం లేదు. విక్రమ్ ప్రమోషన్ సమయంలో లోకేష్ త్వరలో రామ్ చరణ్ సినిమా ఉండొచ్చని చూచాయగా చెప్పాడు. ఇటీవలే ప్రభాస్ కో స్క్రిప్ట్ రాస్తున్నానని చెప్పాడు.
ఖచ్చితంగా ఏది జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే రోలెక్స్, ఖైదీ 2, విక్రమ్ 2 అంటూ కథలు సిద్ధం చేసి లోకి యూనివర్స్ పేరుతో పెద్ద సెటప్ రెడీ చేసుకున్నాడు. అలాంటప్పుడు తెలుగు హీరోలతో చేసే అవకాశాలు తక్కువే. ఇక లియో సంగతికి వస్తే విక్రమ్ క్లైమాక్స్ లో ఎలా అయితే సూర్య క్యారెక్టర్ హైలైట్ అయ్యిందో అదే తరహాలో ఇందులోనూ డిజైన్ చేశాడనే టాక్ ఉంది. కానీ చెన్నై మీడియా వెర్షన్ వేరేలా ఉంది. తన సినిమాలో కొద్ది నిమిషాలే అయినా ఇంకో హీరో డామినేషన్ ని విజయ్ ఒప్పుకునే ఛాన్స్ లేదని గత పదేళ్లకు పైగా ఎవరిని చేయనివ్వలేదని అంటున్నారు
ఇదంతా తేలాలంటే అక్టోబర్ దాకా ఆగాల్సిందే. అంతకన్నా ఆప్షన్ లేదు. ఇలాంటి క్యామియోలు అడిగినప్పుడు చరణ్ మొహమాట పడడు. సల్మాన్ ఖాన్ కోసం కిసీకా భాయ్ కిసీకా జాన్ లో ఓ పిచ్చి పాటకు డాన్స్ చేశాడు. తీరా అది డిజాస్టర్ కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి నిజంగా లోకేష్ అడిగి, అది సూర్య రేంజ్ క్యారెక్టర్ అయ్యుంటే ఖచ్చితంగా ఎస్ చెప్పే ఉంటాడు. కాకపోతే విజయ్ దానికి అనుమతి ఇచ్చాడా లేదానీదే కీలకం. తన డబ్బింగ్ చిత్రం ఎంత గ్రాండ్ గా రిలీజ్ చేసినా కనీసం హైదరాబాద్ మీడియాతో మాట్లాడని హీరో టాలీవుడ్ స్టార్ ని భాగం చేసుకుంటాడా
This post was last modified on July 4, 2023 10:57 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…