తెలుగు, తమిళం, మలయాళం.. ఇలా బహు భాషల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన నిన్నటితరం కథానాయికల్లో అమల ఒకరు. ఆమెది లాంగ్ కెరీర్ కాకపోయినా.. సినిమాల్లో ఉన్నంత కాలం స్టార్ హీరోయిన్‌గానే కొనసాగింది. కెరీర్ ఇంకా మంచి ఊపులో ఉండగానే అమల.. అక్కినేని నాగార్జునను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిపోయింది. తర్వాత చాలా ఏళ్ల పాటు కెెమెరా ముఖం చూడలేదు అక్కినేని వారి కోడలు.
చాలా గ్యాప్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకే ఒక జీవితం లాంటి చిత్రాల్లో అమ్మ పాత్రలతో మెరుస్తోంది అమల. ప్రస్తుతం తమిళంలోనూ ఓ పెద్ద సినిమాలో నటిస్తున్న అమల.. ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి రోజుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మలయాళంలో నటించిన ఓ సినిమా చూసి.. చాలామంది అమ్మాయిలు తమ ఇళ్లు వదిలి తన ఇంటికి వచ్చేసినట్లు ఆమె గుర్తు చేసుకుంది.
‘‘నేను మలయాళంలో చేసిన చిత్రాల్లో బాగా పేరు తెచ్చింది ‘ఎంటే సూర్యపుత్రికు’. 1991లో విడుదలైన ఆ చిత్రంలో నా పాత్ర రెబల్‌గా ఉంటుంది. అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా ఉన్న ఈ సినిమా చూసి.. కేరళకు చెందిన చాలామంది అమ్మాయిలు తమ ఇళ్లు వదిలి పారిపోయి.. చెన్నైలోని నా ఇల్లు వెతుక్కుని వచ్చేశారు. నా పాత్ర వాళ్లకెంతో నచ్చిందని.. తమలో స్ఫూర్తి నింపిందని చెప్పారు.
అప్పుడు నేను తొలిసారి స్టార్‌డమ్ అంటే ఏంటో చూశా. వాళ్ల మీద నా క్యారెక్టర్ ఎలా ప్రభావం చూపిందో అడిగి తెలుసుకున్నా. ఆ విషయం నన్ను సంతోషపెట్టినా.. వాళ్లు చేసింది కరెక్ట్ కాదని నచ్చజెప్పాను. నా మేనేజర్‌ను వాళ్లకు తోడుగా పంపించి మరీ ఇళ్లకు సురక్షితంగా చేరేలా చూశా’’ అని అమల చెప్పింది. ఇక తాను కలిసి నటించిన హీరోల్లో కమల్ హాసన్ నుంచి ఎంతో నేర్చుకున్నట్లుగా అమల తెలిపింది.
This post was last modified on July 4, 2023 7:21 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…