టాలీవుడ్‌ను దశాబ్దానికి పైగా ఏలిన స్టార్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఆమె తమిళంలో కూడా ఒక టైంలో టాప్‌లో ఉంది. హిందీలో కూడా పెద్ద హీరోల సరసన సినిమాలు చేసింది. కాకపోతే ఏ హీరోయిన్‌కు అయినా ఒక దశ తర్వాత గడ్డు కాలం తప్పదు. తమన్నా కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. గత కొన్నేళ్లలో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.
ముఖ్యంగా పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు. అలా అని తన కెరీర్ పూర్తిగా క్లోజ్ అయిపోలేదు. ఈ తరం హీరోయిన్లకు దీటుగా నిలవాలనే ఉద్దేశంతోనో ఏమో.. వెబ్ సిరీస్‌లు చేస్తోంది. అందులో చాలా హాట్‌గా కూడా కనిపిస్తోంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2లో తమన్నా హాట్ సీన్లు యూత్‌కు పిచ్చెక్కించాయి. అదే సమయంలో ఇన్నాళ్లూ కొంచెం పద్ధతిగానే కనిపించిన తమన్నా.. ఇప్పుడు ఇలా హాట్ షోలు చేయడం పట్ల అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి.
ఈ షోల్లో కంటెంట్ పెద్దగా లేకపోవడంతో సెక్స్‌ను అమ్ముకోవడానికే ఇవి చేశారనే విమర్శలూ వచ్చాయి. తమన్నా కూడా సోషల్ మీడియాలో కాక తప్పలేదు. ఈ విమర్శల మీద తమన్నా కొంచెం ఘాటుగానే స్పందించింది. ‘‘ఇప్పుడు మనమున్న రోజుల్లో ఇలాంటి వ్యతిరేకత వస్తుందని నేనస్సలు ఊహించలేదు. కొందమంది మగాళ్లు సోషల్ మీడియా వేదికగా నా మీద ఇలాంటి విమర్శలు చేయడం చూస్తుంటే వింతగా అనిపిస్తోంది.
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టా. కెరీర్ మొదలైనప్పటి నుంచి గ్లామర్ రోల్స్ చేస్తున్నా. అంతే కానీ మొదట్లో డీగ్లామరస్ రోల్స్ చేసి.. ఇప్పుడు ఉన్నట్లుండి ఇలాంటి ప్రాజెక్టులు చేయలేదు. ఇంటిమేట్ సీన్లలో నటిస్తే నా మీద వ్యక్తిగత దాడి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. హీరోలు కూడా ఇలాంటి సీన్లు చేస్తుంటారు. వాళ్లు సూపర్ స్టార్స్ కూడా అవుతారు. నేను 18 ఏళ్ల కెరీర్లో ‘నో కిస్’ కొన్ని హద్దులు పెట్టుకున్నా. ‘నో కిస్’ పాలసీని కూడా పాటించా.న కెరీర్ పరంగా ఎదగాలంటే మారాలనే ఉద్దేశంతో ఇప్పుడీ ప్రాజెక్టులు చేశా’’ అని తమన్నా వివరించింది.
This post was last modified on July 4, 2023 5:51 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…