గత ఏడాది కళ్యాణ్ రామ్ కు అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన బింబిసారకు కొనసాగింపు ఉంటుందని యూనిట్ ప్రమోషన్ టైంలో చెబుతూనే వచ్చింది. కొనసాగింపుకి మంచి స్కోప్ ఉండటంతో కార్తికేయ లాగా దీన్నో సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లాగా మార్చాలనుకున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు వశిష్ట ఒక లైన్ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడు. కానీ ఈలోగా చిరంజీవికి ఒక ఫాంటసీ కథ వినిపించడం, దానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే అగ్రిమెంట్ ప్రకారం సీక్వెల్ కాకుండా వశిష్ట వేరే హీరోతో ప్రాజెక్టు చేయడానికి ఛాన్స్ లేదట.
ఒకవేళ ఇంకో స్టార్ తో వేరే కథను చేయాలన్నా వచ్చే పారితోషికంలో నలభై శాతం దాకా వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా వద్దు అనుకుంటే బింబిసార 2 ని పూర్తి చేయాలి. ఎలాగూ ఇతను సుముఖంగా ఉన్నాడని తెలిసే కళ్యాణ్ రామ్ వెంటనే రొమాంటిక్ ఫేమ్ అనిల్ పాడూరిని లైన్ లోకి తెచ్చాడు. ఫ్రెష్ స్క్రిప్ట్ వండుతారా లేక గతంలో అనుకున్న దానికే మార్పులు చేర్పులు చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ అలా చేయాలన్నా వశిష్ట అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అతను ఓకే చెప్పాలంటే కండీషన్ తీసేయమంటాడు. సో ఇది రెండు వైపులా చిక్కుకున్న సమస్య లాంటిది.
చివరికి పరిష్కారం ఏమవుతుందో కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం పెద్ద చర్చే జరుగుతోంది. చిరంజీవి సినిమా మొదలు పెట్టాలంటే ఇది క్లియర్ చేసుకోవాల్సిందే. ఎలాగూ కళ్యాణ్ కృష్ణతో మెగాస్టార్ చేస్తున్న మూవీ షూటింగ్ కి అయిదారు నెలలు పడుతుంది కాబట్టి ఆలోగానే సెటిల్ చేసుకుంటే రూట్ క్లియరవుతుంది. వశిష్ట మాత్రం రెగ్యులర్ గా చిరు కాంపౌండ్ తో టచ్ లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. బింబిసార లాంటి గ్రాండియర్ కి కథను నమ్మి అంత బడ్జెట్ చేతిలో పెట్టిన కళ్యాణ్ రామ్ కి ఇలా చేయడం పట్ల ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు. ఇదంతా ప్రచారంలో ఉన్న కథే కానీ ఎవరో ఒకరు బయటికి వచ్చి అఫీషియల్ క్లారిటీ ఇస్తే తప్ప మబ్బులు వీడవు
This post was last modified on July 4, 2023 3:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…