Movie News

ఏజెంట్ ఎడిటింగా.. అంతా అబద్దం

ఎప్పుడో ఏప్రిల్ నెలాఖరులో విడుదలైన ఏజెంట్ ఇప్పటిదాకా ఓటిటిలో రాకపోవడం పట్ల ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. కొత్తగా ఎడిటింగ్ చేస్తున్నారని, కట్ చేసిన సీన్లు జోడించి, అవసరం లేని సన్నివేశాలు తీయించి దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గరుండి న్యూ వెర్షన్ సిద్ధం చేయిస్తున్నారని ఏదేదో ప్రచారం జరిగింది. అయితే నిర్మాత అనిల్ సుంకర వాటిని కొట్టిపారేశారు. ఒరిజినల్ ఫుటేజ్ తమ దగ్గరే ఉందని, సోనీ లివ్ వాళ్ళు ప్రత్యేకంగా ఎడిట్ చేయాలని అడగలేదని, ఇదంతా పుకారేనని సామజవగమన సక్సెస్ ప్రెస్ మీట్ లో తేల్చేశారు. ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలనేది వాళ్ళ నిర్ణయం వాళ్ళ హక్కని చెప్పేశారు.

సో ఏజెంట్ యధాతథంగానే డిజిటల్ లో రాబోతున్నాడనే క్లారిటీ వచ్చేసింది. అయితే హక్కులు కొనుగోలు చేసిన సోనీ ఎందుకు ఆలస్యం చేస్తోందనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లే మహా అయితే నలభై అయిదు రోజులకు మించి ఆగడం లేదు. అలాంటిది అల్ట్రా డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న ఏజెంట్ ని ఇంతకంటే లేట్ చేయడం వల్ల ఉన్న ఆసక్తిని కూడా చంపేసినట్టు ఉంటుంది తప్ప ఎలాంటి ప్రయోజనం కలగదు. పైగా ఇలాంటి ఫ్లాపులు కొత్తవి కాదు. గతంలో ఎన్నో వచ్చాయి. మరి ఏజెంట్ ని ఎందుకు ఆపుతున్నారో అర్థం కాని ప్రశ్న.

అఖిల్ దీన్ని ఎప్పుడో మర్చిపోయాడు. విదేశాలకు వెళ్లి వెకేషన్ పూర్తి చేసొచ్చి నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు అనిల్ తో యువి క్రియేషన్స్ ప్లాన్ చేసిన భారీ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రకటించబోతున్నారు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు స్క్రిప్ట్ ని బాగా జల్లెడ పడుతున్నారట. ఇక ఏజెంట్ విషయానికి వస్తే ఇది వచ్చినా రాకపోయినా ఫ్యాన్స్ లో ఎంత మాత్రం ఆసక్తి లేదని ట్విట్టర్ చూస్తే అర్థమైపోతుంది. కాకపోతే డై హార్డ్ అభిమానులు ఇంకోసారి చిన్నితెరపై చూడాలని వెయిట్ చేస్తున్నారు.చూస్తుంటే వంద రోజులు అయ్యాకే డిజిటల్ ఏజెంట్ దర్శనమిచ్చేలా ఉన్నాడు 

This post was last modified on July 3, 2023 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

33 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago