అఫీషియల్ – ఊర మాస్ ‘స్కంద’

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు బోయపాటి శీను కలయికలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కి స్కంధ టైటిల్ ని లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఇది లీకైనప్పటికీ చివరి నిమిషంలో ఏమైనా మార్పు ఉంటుందేమోనని అభిమానులు ఎదురు చూశారు. అయినా ఇంతకన్నా మంచి ఆప్షన్ దొరక్కపోవడంతో ఫైనల్ గా దీనికే ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ 15 విడుదల కాబోతున్న స్కంధ కోసం రామ్ చాలా కష్టపడ్డాడు. ఒళ్ళు పెంచి రిస్కీ ఫైట్లు చేశాడు. ఇస్మార్ట్ శంకర్ ని మించి బ్లాక్ బస్టర్ దక్కాలనే కసితో బెస్ట్ ఇచ్చినట్టు టాక్ ఉంది

చిన్న వీడియో టీజర్ తో స్కంద టైటిల్ ని ప్రకటించారు. నీటి కొలనులో ఉన్న రామ్ పైకి శత్రు మూకలు దూసుకొస్తూ ఉండగా కత్తితో వాళ్ళను తెగ నరుకుతూ నేను దిగితే మిగిలేది ఉండదు అంటూ వాయిస్ ఓవర్ చెప్పించి కంటెంట్ ఎలా ఉండబోతోందో స్పష్టంగా క్లూ ఇచ్చారు. ఓవర్ వయొలెన్స్ తో మాస్ కి గూస్ బంప్స్ వచ్చేలా చేయడంలో ప్రత్యేకత కలిగిన బోయపాటి శీను స్కందకు కూడా అదే ఫార్ములా వాడినట్టు కనిపిస్తోంది. విజువల్స్ లో ఆయన మార్క్ స్పష్టం. కాకపోతే డోస్ ఈసారి ఇంకా పెంచినట్టు నరకడాలు గట్రా చూస్తే అర్థమవుతోంది.

అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో బోయపాటి మరోసారి పవర్ ఫుల్ కథనే రాసుకున్నారు.  ది వారియర్ రూపంలో డిజాస్టర్ తిన్న రామ్ కు మళ్ళీ కంబ్యాక్ కావాలంటే దీని విజయం చాలా కీలకం. పూరి జగన్నాధ్ తో డబుల్ ఇస్మార్ట్ మొదలుపెట్టడానికి ముందు స్కంద హిట్టు కొడితే మంచి జోష్ వస్తుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ వయొలెంట్ డ్రామా టైటిల్ లోగో చూస్తుంటే మధ్య విభూది నామాలు, కింద కుమారస్వామి ఆయుధం గట్రాలు వాడి ఏదో ఆధ్యాత్మిక టచ్ కూడా ఇచ్చారనిపిస్తోంది. తమన్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి