గత కొద్దిరోజులుగా లీకుల రూపంలో తిరుగుతున్న అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ని అధికారికంగా ప్రకటించారు. హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించబోతున్నాయి. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇంత తక్కువ గ్యాప్ తో ఈ కాంబో రిపీట్ కావడం అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. మహేష్ బాబుతో ప్రస్తుతం గుంటూరు కారం తీస్తున్న త్రివిక్రమ్ అది నవంబర్ లోపు పూర్తి చేసి బన్నీ తాలూకు స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంలో బిజీ అవుతారు. అటు పక్క పుష్ప 2తో ఐకాన్ స్టార్ కూడా యమా బిజీగా ఉన్నాడు.
జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములోతో హ్యాట్రిక్ సక్సెస్ లు పూర్తి చేసిన బన్నీ త్రివిక్రమ్ మరోసారి ఆ మేజిక్ ని రిపీట్ చేయబోతున్నారు. అయితే పైన మూడింటిలాగా రెగ్యులర్ కమర్షియల్ టచ్ లో ఉండదట. ప్యాన్ ఇండియా స్కేల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారని వినికిడి. ఎంతనేది బయటికి రాలేదు కానీ రెండు నుంచి మూడు వందల కోట్ల మధ్య ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇన్ సైడ్ టాక్. గుంటూరు కారంతోనే నాన్ బాహుబలి రికార్డులు అందుకుంటామని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నిర్మాత నాగవంశీ ఈసారి ఇంకే స్థాయిలో ఊరిస్తారో చూడాలి.
సంగీత దర్శకుడిగా తమనే ఉండబోతున్నాడు. అధికారికంగా చెప్పనప్పటికీ ఈ రోజు అప్డేట్ ని నిన్న తన హ్యాండిల్ నుంచి కూడా ట్వీట్ చేయడంతో ఈ విషయంలో అనుమానం అక్కర్లేదు. త్రివిక్రమ్ కాంపౌండ్ తమన్ పనితనం పట్ల ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ ఎవరితో చేతులు కలుపుతాడనే సస్పెన్స్ కు మొత్తానికి చెక్ పడిపోయింది. గురూజీ కెరీర్ లో ఇప్పటిదాకా కేవలం ప్రొడక్షన్ కే వందల కోట్లు ఖర్చైన సినిమా లేదు. ఇది దానికి శ్రీకారం చుట్టబోతోంది. సుకుమార్ తరహాలో త్రివిక్రమ్ కూడా నేషనల్ మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు
This post was last modified on July 3, 2023 10:47 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…