మోస్ట్ కాంట్రవర్షియల్ రియాలిటీ షోగా పేరున్న బిగ్ బాస్ లో సభ్యులు ఎంత అతి చేస్తారో తెలిసిందే. టైటిల్ గెలవడం కోసం ఎంతకైనా దిగజారేందుకు సిద్ధపడటం విదేశాల్లో ఎక్కువగా ఉండేది కానీ అలాంటి కల్చర్ ని మనదాంట్లోనూ తీసుకొచ్చే ప్రయత్నాలు నిర్వాహకులు చేస్తున్నారు. ఇటీవలే జియో సినిమా యాప్ లో ఈ షో ఓటిటి వెర్షన్ మొదలైంది. యాంకర్ గా సల్మాన్ ఖానే వచ్చాడు. టీవీపై పదమూడు సీజన్లు నిర్విరామంగా నడిపిన అనుభవాన్ని ఇక్కడా పంచాలనుకున్నాడు. అయితే మొదలైన కొద్దిరోజులకే అభ్యంతరకర వివాదాలు మొదలైపోయాయి.
ఇటీవలే జరిగిన ఒక ఎపిసోడ్ లో మోడల్ జద్ హదీద్ ఆటలో భాగంగా తన కో పార్టిసిపెంట్ బేబీకా ధృవేకి అసభ్యంగా అనిపించే రీతిలో వెనుక శరీరపు కింది భాగాన్ని చూపించి వెక్కిరించాడు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. అంతే కాదు నిమిషాల కొద్దీ మరో ఇద్దరు సభ్యులు పెట్టుకున్న లిప్ లాక్ కిస్సు వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. అమ్మాయిలు ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలని సూక్తులు చెప్పే కండల వీరుడు ఇవన్నీ చూసుకోవడం లేదా అంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో గట్టిగానే నిలదీశారు. దీంతో సల్మాన్ ఖాన్ హౌస్ మేట్స్ కు మాములు క్లాస్ పీకలేదు
ఇకపై ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని బేషరతుగా క్షమాపణ చెప్పించి నిర్మాతలకు కూడా ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేశాడు. అంతే కాదు ఈ ప్రవర్తనకు కారణమైన జద్ హదీద్ ని ఉద్దేశించి నాలుగేళ్ళ కూతురు ఉన్న నువ్వు నీ చేష్టల వల్ల ఆ పసిపాప తలదించుకునే పరిస్థితి రాకూడదని చెప్పినప్పుడు అతను భోరున ఏడ్చేశాడు. అప్పుడు కానీ సల్మాన్ ఈ ఇష్యూ పట్ల ఎంత సీరియస్ గా ఉన్నాడో అభిమానులకు అర్థం కాలేదు. ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తున్న జియోకు ఇప్పుడీ వివాదం వల్ల మంచి మైలేజ్ తో పాటు పబ్లిసిటీ దొరికేసింది. బిగ్ బాస్ అసలు ఉద్దేశమే అది కదా
This post was last modified on July 3, 2023 7:18 am
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…
అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్‌లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…