ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఎంతగానో ఆకర్షించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో అతను అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్లోకి. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్‌ల అరుదైన కలయికలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మంచి ఫ్యామిలీ సినిమా తీసి ఆశ్చర్యపరిచాడు. వరుసగా రెండు పెద్ద హిట్లివ్వడంతో శ్రీకాంత్ మీద అంచనాలు పెరిగిపోయాయి.
మధ్యలో ‘ముకుంద’ అంచనాలను అందుకోకపోయినప్పటికీ.. మళ్లీ మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ లాంటి భారీ ప్రాజెక్టును లైన్లో పెట్టడంతో శ్రీకాంత్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ‘బ్రహ్మోత్సవం’ టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో శ్రీకాంత్ కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. రీమేక్ మూవీ ‘నారప్ప’తో రీఎంట్రీ ఇచ్చినా అది తన సినిమాలా అనిపించలేదు.
ఇప్పుడు మళ్లీ గ్యాప్ తీసుకుని ‘పెదకాపు’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు శ్రీకాంత్. ఈ సినిమా టైటిల్‌తోనే అందరిలోనూ క్యూరియాసిటీ పెంచింది. ఇప్పుడు టీజర్ చూసి అందరూ షాకవుతున్నారు. 80వ దశకం నేపథ్యంలో ఒక ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా తీసినట్లున్నాడు శ్రీకాంత్. ఈ సినిమాకు ఎంచుకున్న నేపథ్యంతో పాటు తన ఆస్థాన నటుడు రావు రమేష్‌తో పాటు తమిళ ఆర్టిస్టు ఆడుగళం నరేన్, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి పాత్రలు ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. టీజర్లో ఇంటెన్సిటీ కనిపించింది.
‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కొంచెం భారీగానే ఖర్చు పెట్టి ఈ సినిమా తీసినట్లున్నాడు. ఇందులో శ్రీకాంత్ సైతం ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. సినిమాకు సంబంధించి అన్నీ బాగున్నాయి కానీ.. హీరో విషయంలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ అనే కొత్త నటుడు ఇందులో హీరోగా చేశాడు. కథలోని ఇంటెన్సిటీ, భారీతనం చూస్తే.. ఎవరైనా పేరున్న హీరో ఈ పాత్ర చేయాల్సిందనిపిస్తోంది. ఒక కొత్త నటుడు ఇంత బరువైన పాత్రను, సినిమాను మోయగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కొత్తబ్బాయి టాలెంటుని తక్కువ చేయడం కాదు కానీ.. టీజర్లో మాత్రం అతను అంతగా ఎలివేట్ కాలేదు. కచ్చితంగా ఇది ఇమేజ్ ఉన్న నటుడి చేయాల్సిన కథలాగే అనిపించింది. మరి సినిమాలో హీరో తన పాత్రకు న్యాయం చేసి ఈ సందేహాలుకు తెరదించుతాడేమో చూడాలి.
This post was last modified on July 2, 2023 6:54 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…