ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘ప్రాజెక్ట్-కే’ ఒకటి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా అవతరించిన ప్రభాస్ హీరోగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రమిది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ కాస్ట్ ఉండటంతో ఈ సినిమా స్కేలే వేరుగా కనిపిస్తోంది. ఈ సినిమాను అనౌన్స్ చేసినపుడే బడ్జెట్ రూ.500 కోట్లుగా చెప్పుకున్నారు.
కానీ సినిమా పూర్తయ్యేసరికి ఇంకో రెండొందల కోట్లు బడ్జెట్ పెరగొచ్చని తెలుస్తోంది. ఇటీవలే కమల్ హాసన్ ఈ ప్రాజెక్టులోకి రావడంతో దీని మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. పైగా కమల్ చేయబోతోంది విలన్ పాత్ర అన్న ఊహాగానాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ప్రభాస్, కమల్ ఢీ అంటే ఢీ అని తలపడితే ఆ మజానే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
కాగా ఈ సినిమా కథాంశం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇది ప్రధానంగా సైన్స్ ఫిక్షన్ కథ కాగా.. దీనికి ఫాంటసీ టచ్ కూడా ఉంటుందట. చెడు మీద మంచి విజయం సాధించడం అనే యూనివర్శల్ పాయింట్ ఆధారంగా సిినిమా తెరకెక్కుతోందని.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నడిచే కథ అంతా హాలీవుడ్ సినిమాలను తలపిస్తే.. దీనికి ఇచ్చిన ఫాంటసీ టచ్ ఇండియన్ మైథాలజీస్‌ను గుర్తు చేస్తుందని అంటున్నారు. ఈ రెంటినీ మిక్స్ చేసిన విధానమే సినిమాలో హైలైట్ అట.
అమితాబ్, ప్రభాస్, కమల్.. ఈ ముగ్గురూ ఇందులో శాస్త్రవేత్తలుగా కనిపించనుండగా.. ప్రభాస్ ఇందులో విష్ణువు అవతారంలోనూ కనిపించనున్నట్లుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ కథను మైథాలజీతో ముడిపెట్టిన క్రమంలో కనిపించే విష్ణువు అవతారాన్ని కూడా ప్రభాసే పోషించాడట. విష్ణువు అవతారంలో ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంటుందని.. ఇటీవలే ‘ఆదిపురుష్’లో రాముడిగా కనిపించినపుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, విష్ణువుగా మాత్రం ప్రభాస్ మెప్పిస్తాడని అంటున్నారు.
This post was last modified on July 2, 2023 4:12 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…