Movie News

యానిమల్ అయోమయం తీరిపోయింది

బాలీవుడ్ హీరో రన్బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతున్న అనిమల్ విడుదల తేదీ విషయంలో  సందిగ్దత తీరిపోయింది. ఆగస్ట్ 11 ఖచ్చితంగా వస్తుందని మొన్నటిదాకా చెబుతూ వచ్చిన నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు వాయిదా సమాచారాన్ని అధికారికంగా ఇచ్చేశాయట. బిజినెస్ డీల్స్ జరుగుతున్నప్పటికీ రిలీజ్ డేట్ కు సంబంధించి వ్యవహారాన్ని నాన్చుతూ వచ్చి ఫైనల్ గా తేల్చేశారు. ఇటీవలే ఒక చిన్న ప్రీ టీజర్ తప్ప ఎలాంటి ప్రమోషన్ జరగలేదు. షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతోంది .

అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు యానిమల్ కు సంబందించిన చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే డిసెంబర్ మొదటి వారానికి వెళ్లాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నా సరే విపరీతమైన పోటీలో దిగడం వల్ల సౌత్ మార్కెట్లలో దెబ్బ పడే ప్రమాదం ఉంది. తమిళంలో రజనీకాంత్, తెలుగు చిరంజీవిలు ఢీ కొట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళను తక్కువంచనా వేయడానికి లేదు. మాస్ మార్కెట్లను ప్రభావితం చేస్తారు. పైగా అటు హిందీలోనూ గదర్ ఏక్ ప్రేమ్ కథ 2 రూపంలో కాంపిటీషన్ ఉంది.

దీంతో రిస్క్ ఎందుకు లెమ్మని డెసిషన్ మార్చుకుని ఉండొచ్చు. ఎందుకంటే చేతిలో పెద్దగా టైం లేదు. కేవలం నలభై రోజుల్లో పబ్లిసిటీతో పాటు ఇండియా వైడ్ బజ్ వచ్చేలా హంగామా చేయాలి. యానిమల్ ఆల్ టైం టాప్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఇప్పటికే  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రన్బీర్ కపూర్ పాత్రని చాలా అగ్రెసివ్ గా డిజైన్ చేశారని, ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని గ్యాంగ్ స్టర్ డ్రామాని ఆవిష్కరించబోతున్నట్టు సమాచారం. మరి అలాంటప్పుడు సోలోగా వస్తేనే అడ్వాంటేజ్ దక్కుతుంది. అందుకే ఫైనల్ గా పోస్ట్ పోన్ వార్తని అఫీషియల్ చేయబోతున్నారు. 

This post was last modified on July 1, 2023 11:17 pm

Share

Recent Posts

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

40 minutes ago

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

1 hour ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

3 hours ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

3 hours ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

6 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

6 hours ago