సెలబ్రెటీలు చాలా ఆరోగ్యంగా, హుషారుగా కనిపిస్తారు కానీ.. వాళ్లను కూడా శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతుంటాయి. పైకి మామూలుగా కనిపిస్తున్నా.. లోలోన వాళ్లు బాధ పడుతుంటారు. దీపికా పదుకొనే లాంటి వాళ్లు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వరకు వెళ్లిన విషయం వెల్లడైనపుడు అందరూ షాకయ్యారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. కూడా డిప్రెషన్ ఎదుర్కొన్న విషయం ఆలస్యంగా వెల్లడైంది. బిడ్డకు జన్మనిచ్చాక కొందరు ఎదుర్కొనే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ను కాజల్ కూడా ఎదుర్కొందట. అతి కష్టం మీద తాను ఆ సమస్యను అధిగమించినట్లు తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించింది చందమామ.
‘‘అవును.. నేను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎదుర్కొన్నా. కానీ అది మామూలు విషయమే. చాలామందికి ఎదురయ్యే సమస్యే. మహిళలు ఎవరైనా ఈ డిప్రెషన్ ఎదుర్కొంటుంటే కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలి. మహిళలు సైతం పిల్లలు పుట్టాక తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కవుట్లు చేయడం.. ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం.. చిన్న చిన్న పనులుు చేయడం ద్వారా ఆ దశను దాటవచ్చు.
నేను ఈ పనులన్నీ చేశా. పైగా నన్ను ఎంతగానో అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల నేను ఆ దశ నుంచి బయటికి రాగలిగాను. నేను ఆ దశను ఎదుర్కొన్నపుడు నా భర్త గౌతమ్ చాలా బాధ పడ్డాడు’’ అని కాజల్ తెలిపింది. తన స్నేహితురాలు తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఆ సిరీస్ చూశానని, తమన్నా అద్భుతంగా నటించిందని, ఆమెను చూస్తే తనకు భయం కలిగిందని కాజల్ చెప్పడం విశేషం.
This post was last modified on July 1, 2023 5:25 pm
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…