ఒక పెద్ద హీరో సరసన చేసిన నటించిన సినిమా సూపర్ హిట్ అయితే.. ఆ హీరోయిన్‌కు అవకాశాలు వెల్లువెత్తాలి. కానీ మలయాళ భామ హనీ రోజ్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై పెద్ద హిట్ అయిన ‘వీరసింహారెడ్డి’లో ఆమె ఒక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కూడా ఓ కథానాయికగా నటించినప్పటికీ.. ఆ సినిమా రిలీజ్ ముంగిట అందరి దృష్టినీ ఆకర్షించింది హనీనే.
ప్రి రిలీజ్ ఈవెంటే కాక.. హనీ పాల్గొన్న వేరే కార్యక్రమాల్లో కూడా ఆమె క్రేజ్ చూసి అందరూ షాకయ్యారు. ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఈమెకు ఈ క్రేజ్ ఏంట్రా బాబూ అనుకున్నారు సోషల్ మీడియా జనాలు. ‘వీరిసింహారెడ్డి’ హిట్టయితే అమ్మడిని ఆపడం కష్టం అనుకున్నారు. కానీ ఆ సినిమా వచ్చి ఆరు నెలలు కావస్తున్నా తెలుగులో హనీకి ఇంకో ఛాన్స్ రాలేదు.
హనీ వయసు కొంచెం ఎక్కువ కావడం, ట్రెండీగా అనిపించకపోవడం మైనస్ అవుతుండొచ్చేమో. ఆమెది 18 ఏళ్ల కెరీర్ కావడం విశేషం. 2005లోనే ఆమె కథానాయిక అయింది. తెలుగులోనూ ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే చిన్న సినిమాల్లో నటించింది గతంలో. ఐతే అప్పుడు ఆమెకు ఎలాంటి గుర్తింపూ రాలేదు. బాలయ్య లాంటి పెద్ద హీరోతో జోడీ కట్టడంతో తన పేరు మార్మోగింది. ఆమె హాట్ లుక్స్ యువతను కూడా బాగానే ఆకట్టుకున్నాయి.
సోషల్ మీడియాలో తన ఫొటోలు ట్రెండ్ అయ్యాయి. దీనికి తోడు సినిమా కూడా హిట్టయింది. అయినా ఎందుకో హనీని ఏ దర్శకుడూ, నిర్మాతా తమ సినిమాల్లో కన్సిడర్ చేస్తున్నట్లు కనిపించడం లేదు. యంగ్ హీరోల పక్కన ఆమె సూట్ కాకపోవచ్చు కానీ.. సీనియర్లకు ఎలాగూ హీరోయిన్ల కొరత ఉంది కాబట్టి వాళ్లకు అయినా జోడీగా తీసుకుంటారేమో చూడాలి.
This post was last modified on July 1, 2023 2:41 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…