పేరుకి తమిళ డైరెక్టరే అయినా మురుగదాస్ తో మన అభిమానులకు మంచి కనెక్షన్ ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తమకు స్పైడర్ లాంటి డిజాస్టర్ ని పీడకలగా ఇచ్చినందుకు సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు. చిరంజీవితో చేసిన స్టాలిన్ కూడా ఏమంత అద్భుతాలు చేయలేకపోయింది. గజిని బ్రాండ్ తోనే దశాబ్దాల పాటు నెట్టుకొచ్చిన దాస్ కి దాని తర్వాత ఆయన అత్యుత్తమ పనితనం కనిపించింది తుపాకీలోనే. విజయ్ ఇమేజ్ ని పెంచడమే కాదు ఒక కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం గురించి మూవీ లవర్స్ అవకాశం దొరికినప్పుడంతా మెచ్చుకుంటారు.
ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న మురుగదాస్ గత కొంత కాలంగా సరైన హీరో దొరకక ఇబ్బంది పడుతున్నారు. విజయ్ సర్కార్, రజినీకాంత్ దర్బార్ ఒరిజినల్ వెర్షన్లు బాగానే ఆడినా ఇతర భాషల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. పైగా కథకుడిగానూ దాస్ ఫెయిలవుతున్నారు. రెండు నెలల క్రితం తనే నిర్మాతగా మారి రచన చేసిన ఆగస్ట్ సిక్స్ టీన్ 1947 దారుణంగా పోయింది. త్రిష ప్రధాన పాత్రలో రూపొందిన రంగికి స్టోరీ ఇస్తే అది కూడా తుస్సుమంది. ఇలాంటి ట్రాక్ రికార్డుతో నాలుగేళ్ల కాలం ఖర్చయిపోయింది. ఫైనల్ గా ఈయనకో హీరో సెట్ అయ్యాడు.
శివ కార్తికేయన్ తో ఓ ప్యాన్ ఇండియా మూవీకి మురుగదాస్ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు చెన్నై టాక్. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలనలో ఉంది. సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ తప్ప వేరే ఆప్షన్ చూడటం లేదట. పీరియాడిక్ డ్రామా సెటప్ తో చాలా వైవిధ్యమైన పాయింట్ తో దాస్ దీన్ని రాసుకున్నట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ లాంటి హీరోతో చేసే అవకాశాన్ని చేతిదాకా వచ్చి పోగొట్టుకున్న మురుగదాస్ కి ఇప్పుడీ కంబ్యాక్ చాలా అవసరం. మంచి మార్కెట్ ఉన్న హీరో దొరికాడు. దాన్ని వాడుకోవడం ఆయన చేతుల్లోనే ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిందే
This post was last modified on July 1, 2023 11:16 am
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…