ఈ వారం కొత్త సినిమాలు చాలా ఉన్నాయి కదా, రీ రిలీజులు ఎవరు పట్టించుకుంటారనే లెక్క పూర్తిగా తప్పింది. సరైన ప్లానింగ్, ప్రమోషన్ లేకపోయినా యూత్, అభిమానులు వీటి కోసం ఎగబడ్డారు. ముందుగా చెప్పాల్సింది ఈ నగరానికి ఏమైంది గురించి. ప్లాన్ చేసుకున్నది తక్కువ షోలు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ లో అనూహ్యంగా సోల్డ్ అవుట్ లు పెరిగిపోవడంతో అప్పటికప్పుడు వేరే షోలు తగ్గించి దీనికి కేటాయించాల్సి వచ్చింది. నిన్న రోజు సెకండ్ షో నాటికి నాలుగు వందలపైనే స్క్రీనింగ్స్ జరిగాయని ట్రేడ్ టాక్. దెబ్బకు జూలై 2 దాకా థియేటర్లలో కొనసాగిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తొలిప్రేమది మరో కథ. ముందు ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. జనసేనకు దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, థర్డ్ పార్టీ వాళ్ళ లాభాల కోసం వేస్తున్నారనే ప్రచారం వల్ల మొదట కొంత నెగటివ్ ట్రెండ్ నడిచింది. అయితే గంటల వ్యవథిలో మొత్తం సీన్ మారిపోయింది. ప్రింట్ బాగుందని, వింటేజ్ కళ్యాణ్ ని ఫోర్ కెలో చూస్తుంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువేనని ట్విట్టర్ లో మోత మోగిపోవడంతో అప్పటికప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు లక్షల్లోనే ఉంటారు. ముఖ్యంగా సంధ్య 70 ఎంఎం, ప్రసాద్ లాంటి చోట జనం కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు .
ఒకరకంగా ఇవి స్పై, సామజవరగమనలకు కొంత, మిగిలిన చిన్న సినిమాలకు తీవ్రంగా ప్రభావం చూపించాయి. కొత్త రిలీజులు ఎప్పుడైనా చూసుకోవచ్చు కానీ తొలిప్రేమ, ఈ నగరానికి ఏమైందిలను ఇంత సందడి మధ్య మళ్ళీ చూసేందుకు అవకాశం రాదనే కారణమే ఇలాంటి పరిస్థితికి దారి తీసింది. మెయిన్ సెంటర్స్ లో ఈ వీకెండ్ కూడా ఇదే సన్నివేశం కనిపించేలా ఉంది. తొలిప్రేమని మరో సందర్భంలో ఇంకాస్త ప్లాన్డ్ గా తీసుకొచ్చి ఉంటే ఖుషి, జల్సాలకు ధీటుగా నిలిచేదన్న కామెంట్ లో నిజం ఉంది. దర్శకులు కరుణాకరన్, తరుణ్ భాస్కర్ లు షాక్ తో కూడిన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు
This post was last modified on July 1, 2023 6:07 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…