సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలో ఉన్న టాపిక్స్ లో నెట్ ఫ్లిక్స్ కొత్త వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 ఒకటి. విడుదలకు ముందే మంచి హైప్ మూటగట్టుకున్న ఈ అడల్ట్ ఎంటర్ టైనర్ లో స్టార్ క్యాస్టింగ్ ఎక్కువగా ఉండటంతో సహజంగానే హైప్ పెరిగింది. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అంచనాలకు తగ్గట్టు మొదటి భాగం లాగా ఈసారి మేజిక్ జరగలేదు. ఎంతసేపూ కామ కోరికలను హైలైట్ చేయడం తప్ప నలుగురు దర్శకులు అసలు ఉద్దేశాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయారు. రెండుంపావు గంటలకు పూర్తి న్యాయం చేయలేకపోయారు. మొత్తం నాలుగు కథలు చెప్పారు.
పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న వేద(మృణాల్ ఠాకూర్), అర్జున్|(అంగద్ బేడీ)ని ముందే సెక్స్ చేసుకోమని ప్రోత్సహిస్తుందో గొప్ప బామ్మ(నీనా గుప్తా). వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారనేది మంచి బూతు డైలాగులు, హాట్ సీన్లతో కూడిన ముగింపు. రెండో స్టోరీలో ఒంటరిగా ఉన్న ఉద్యోగి ఇషిత(తిలోత్తమ శోమి)తన భర్త పనిమనిషితో రొమాన్స్ చేయడాన్ని రెడ్ హ్యాండెడ్ గా చూస్తుంది. మూడో కథలో స్త్రీలంటే కామవాంఛతో రగిలిపోయే విజయ్(విజయ్ వర్మ)తమ మాజీ ప్రియురాలు శాంతి(తమన్నా) కనిపించినప్పుడు ఏం చేశాడనేది అసలు ట్విస్టు. నాలుగో దాంట్లో వయసుమళ్ళినా కోరికలు చావని భర్త(కుముద్ మిశ్రా)ని భార్య దేవయాని(కాజోల్) ఏం చేసిందనే పాయింట్ తో తీశారు. మొత్తం బూతు మయమే
అన్ని ఎపిసోడ్లు మగాడు శృంగార వాంఛతో రగిలిపోయే పరిణామాల చుట్టే తిరిగాయి. ఏదో ఫ్యామిలీ సిరీస్ అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు కానీ నిజంగా బూతు కంటెంట్ పుష్కలంగా నిండి ఉన్న లస్ట్ స్టోరీస్ 2ని కనీసం లైఫ్ పార్ట్ నర్ తో చూడాలన్నా ఇబ్బందే. పోనీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండి, మంచి టెంపో ఉంటే వీటిని ఇష్టపడే వర్గాన్ని సంతృప్తి పరిచే ఛాన్స్ ఉండేది. అవేవీ లేకుండా యూత్ ఇలాంటివి మాత్రమే ఎగబడి చూస్తారనే భ్రమలో దర్శకులు బాల్కీ-సుజయ్ ఘోష్-అమిత్-కొంకణాసేన్ శర్మలు అడల్ట్స్ కి మాత్రమే అనే ఉద్దేశంతో ఎవరినీ మెప్పించని సిరీస్ ని ఇచ్చారు.
This post was last modified on June 30, 2023 11:44 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…