ప్రతీ వారం లానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి నిఖిల్ ‘స్పై’ , శ్రీ విష్ణు ‘సామజవరగమన’. వీటిలో నిఖిల్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. శ్రీ విష్ణు క్లీన్ ఎంటర్టైన్ మెంట్ తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. రాజ రాజ చొర తర్వాత మళ్ళీ సామజవరగమన తో సూపర్ హిట్ కొట్టిన శ్రీ విష్ణు కి ఇప్పుడు పోటీ ఇబ్బంది నెలకొంటుంది.
ఈ వారం నిఖిల్ స్పై కాకుండా శ్రీ విష్ణు సినిమాకు రీ రిలీజ్ పోటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ ‘తొలి ప్రేమ’ , విశ్వక్ సేన్ ‘ఏమైంది ఈ నగరానికి’ సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ రూపంలో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే సినిమాలు కావడంతో ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా తొలి ప్రేమ ఎఫెక్ట్ గట్టిగా ఉంది. పవన్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇక ఉన్న మంచి థియేటర్స్ కాస్త నిఖిల్ స్పై. దీంతో శ్రీ విష్ణు సూపర్ హిట్ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది.
రెండ్రోజుల ముందు నుండి ప్రీమియర్స్ వేయడం, రిలీజ్ కి ముందే సూపర్ హిట్ టాక్ రావడంతో తొలి రోజు 2 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కానీ శ్రీ విష్ణు కి ఈ టాక్ తో సోలో రిలీజ్ పడి ఉంటే బెటర్ గా ఉండేది. ఏదేమైనా ఆదిపురుష్ అద్భుతం చేస్తుందేమో అని అటు నిఖిల్ , ఇటు శ్రీ విష్ణు వారం వెనక్కి తగ్గాల్సి. దీంతో ఈ పోటీ రిలీజ్ ప్రభావం శ్రీ విష్ణు సినిమాపై గట్టిగా పడింది. మరి వచ్చిన హిట్ టాక్ తో శ్రీ విష్ణు లాంగ్ రన్ లో ఎంత కలక్ట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on June 30, 2023 11:40 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…