ఏడాది నుంచి టాలీవుడ్లో పాత సినిమాల రీ రిలీజ్ హంగామా చూస్తున్నాం. ఐతే వీటిలో మిగతా సినిమాలన్నీ ఒకెత్తయితే.. పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ మరో ఎత్తు. ఆయన సినిమాలకు పీఆర్ టీంల హంగామా ఉండదు. అభిమాన సంఘాలు డబ్బులేసుకుని టికెట్లు కొని క్రేజ్‌ను చాటే ప్రయత్నం జరగదు. అలాగే థియేటర్లలో ఫేక్ సెలబ్రేషన్లు ఉండవు. పనిగట్టుకుని ఎవరూ ఏమీ చేయకుండానే క్రేజ్ ఎల్లలు దాటిపోతుంటుంది.
జల్సా, ఖుషి సినిమాలకు వచ్చిన కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ జనాలకు దిమ్మదిరిగింది. ఈ ఏడాది కాలంలో హిట్ అయిన చిన్న సినిమాలకు దీటుగా వాటికి వసూళ్లు రావడం విశేషం. వందల సంఖ్యలో షోలు సోల్డ్ అవడం అంటే మాటలు కాదు. ఇక థియేటర్లలో పవర్ స్టార్ అభిమానుల సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. జల్సా, ఖుషి స్పెషల్ షోలకు థియేటర్లు ఊగిపోయాయి.
ఇప్పుడు ‘తొలి ప్రేమ’ విషయంలోనూ పవన్ క్రేజ్ ఎలాంటిదో మరోసారి రుజువు అవుతోంది. నిజానికి జల్సా, ఖుషి చిత్రాల లాగా ఇది యాక్షన్ టచ్ ఉన్న సినిమా కాదు. పైగా రిలీజ్ ముంగిట అభిమానులు మరీ హడావుడి ఏమీ చేయలేదు. ఈ సినిమా రీ రిలీజ్‌లో అభిమానుల భాగస్వామ్యం కూడా ఏమీ లేదు. కానీ ‘తొలి ప్రేమ’ స్పెషల్ షోలకు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఈ రోజు హైదరాబాద్‌లో అన్ని షోలూ హౌస్ ఫుల్ అయిపోయాయి. నిన్న, గురువారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో స్పెషల్ ప్రిమియర్ వేస్తే.. దానికి జనం పోటెత్తారు.
క్రాస్ రోడ్స్‌లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పాతికేళ్ల కిందటే ఇదే థియేటర్లో ‘తొలి ప్రేమ’ సంచలనం రేపింది. మళ్లీ ఇప్పుడు అక్కడ అదే సినిమా సందడి చేయడం పవన్ అభిమానులకు ఒక మధుర జ్ఞాపకమే. ఇక ఈ సినిమా చూస్తూ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పాటలకు కోరస్ పాడుతూ అభిమానులు రచ్చ రచ్చ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి పవన్ కళ్యాణ్ క్రేజ్ కా బాప్ అని అభిమానులు కొనియాడుతున్నారు.
This post was last modified on June 30, 2023 7:43 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…