మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొణిదెల గారాలపట్టికి ఇవాళ నామకరణం చేశారు. క్లింకారా కొణిదెల పేరుని ఖరారు చేస్తూ తాతయ్య చిరంజీవి స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. ఇదేం పేరనే అయోమయం లేకుండా దానికి స్పష్టమైన వివరణ కూడా ఇచ్చారు. లలిత సహస్రనామం నుంచి తీసుకున్న పదం ఇది. శక్తిని స్వచ్ఛంగా మార్చి ఒక ఆధ్యాత్మిత చింతనను మేల్కొలిపే మార్పే ఈ క్లింకారా. ఈ లక్షణాలను పుణికి పుచ్చుకుని తన వ్యక్తిత్వం ఇముడ్చుకుని గొప్పగా ఎదుగుతుందని చిరు అందులో పేర్కొన్నారు.
ఇద్దరు తాతలు, బామ్మలు, అమ్మానాన్నలతో ఉన్న ఫోటో ట్వీట్ చేశారు. బేబీ మొహం అందులో కనిపించకపోయినా త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొణిదెల ఫ్యామిలీ ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూ సంబరం జరుపుకుంటోంది. అభిమానులు అప్పుడే ఈ వార్తను వేలల్లో షేర్ చేసుకోవడమే కాక కొందరు ఏకంగా క్లింకారా పేరుతో మీద ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేసి అప్పుడే మెంబెర్స్ ని జోడించుకుంటున్నారు. పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ వచ్చిన తొలిబిడ్డ కావడంతో చరణ్ ఉపాసన సంతోషానికి హద్దులు లేవు.
ఇంటి పేరుతో కలిపి ఇంగ్లీష్ లో కెకెకె అనే షార్ట్ ఫార్మ్ రావడం బాగుంది. పిక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఆన్ లైన్లో శుభాకాంక్షలు పర్వం మొదలైపోయింది. గ్రాండ్ గా చేసినప్పటికీ ఫంక్షన్ ని మరీ ఎక్కువ అట్టహాసంగా నిర్వహించలేదు. ఆహ్వానితుల్లో ఎక్కుడ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ లేరు. విడిగా మరో వేడుక చేసి అప్పుడు అందరిని ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నారు చరణ్, ఉపాసన. అభిమానులు మాత్రం బేబీని చిరు పవన్ చరణ్ లు ఎత్తుకున్న ఫోటోలు పెట్టమని అప్పుడే విజ్ఞప్తులు చేస్తున్నారు
This post was last modified on June 30, 2023 6:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…