గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సోషల్ మీడియాలో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఐతే ఎక్కువగా ట్విట్టర్లో వివాదాలు, ఆరోపణలు, వాదోపవాదాలతోనే ఆమె ట్రెండ్ అవుతూ ఉంటుంది. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఆమె వైరముత్తు లాంటి వ్యక్తుల మీద అలుపెరగని పోరాటం చేస్తోంది. అలాగే సెలబ్రెటీలే కాక మామూలు అమ్మాయిలకు కూడా ఎక్కడైనా లైంగిక వేధింపులు ఎదురైనట్లు వార్తలు వస్తే.. వాటి మీద చిన్మయి స్పందిస్తూ ఉంటుంది.
ఐతే కొన్నిసార్లు ఆమె అభిప్రాయాలు, వాదనలు విడ్డూరంగా ఉంటాయంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తుంటారు. ఎప్పుడూ మహిళల కోణంలోనే ఆమె మాట్లాడుతుందని.. మగాళ్లందరూ చెడ్డవాళ్లన్నట్లు వాదిస్తుందని ఆమెను టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేసి ఆమెను అదుపులో పెట్టుకోమని.. కౌన్సెలింగ్ ఇవ్వమని నెటిజన్లు పోస్టులు పెడుతుంటారు.
ఇటీవల ఈ రకమైన దాడి ఎక్కువైపోవడంతో రాహుల్ రవీంద్రన్.. నెటిజన్లకు ఒక అప్పీల్ ఇస్తూ పోస్టు పెట్టాడు. ‘‘ఆమెతో గొడవ పడ్డాక నన్ను ట్యాగ్ చేసే అబ్బాయిలందరికీ ఒక విన్నపం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె లేవనెత్తే సమస్యల గురించి విశాల దృక్పథంతో ఆలోచించండి. మీరు ఆమెతో ఏకీభవించవచ్చు. లేదా వ్యతిరేకించవచ్చు. కానీ ముందు ఆమె చెప్పేది వినండి. ఆమెకు మీరు ప్రేమను ఇస్తే.. తిరిగి మరింత ప్రేమనే పంచుతుంది.
మీకు చాలా ఇష్టమైన అక్కలా ఉంటుంది. లిమిట్ లేకుండా ప్రేమిస్తది. సమస్యలను మీరు వేరే కోణంలో చూడటం మొదలుపెడితే.. ఇందుకోసం చిన్న ఎఫర్ట్ పెడితే మీ జీవితంలో ఉన్న మహిళలు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తారు. మీ మీద మునుపటి కంటే గౌరవం చూపిస్తారు. దీని వల్ల మీ ప్రపంచం ఎంత సంతోషంగా మారుతుందో మీరు ఊహించలేరు’’ అని రాహుల్ రవీంద్రన్ పోస్ట్ పెట్టాడు. కొందరు ఈ పోస్ట్ పట్ల సానుకూలంగా స్పందిస్తుండగా.. కొందరు మాత్రం భార్యను వెనకేసుకు వస్తున్నావా అంటూ అతణ్ని టార్గెట్ చేస్తున్నారు.
This post was last modified on June 30, 2023 2:13 pm
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…