యువ కథానాయకుడు శ్రీ విష్ణు చివరి సినిమా ‘అల్లూరి’ పెద్ద డిజాస్టర్. అంతకుముందు అతడి నుంచి వచ్చిన భళా తందనాన, అర్జున ఫల్గుణ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. వరుసగా మూడు డిజాస్టర్లు ఇచ్చిన హీరో నుంచి వచ్చే తర్వాతి సినిమా మీద ఏమాత్రం బజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘సామజవరగమన’ పేరుతో శ్రీ విష్ణు సినిమా చేస్తున్నాడన్న విషయం వెల్లడైనపుడు ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. లాక్ డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ‘వివాహ భోజనంబు’తో దర్శకుడిగా పరిచయం అయిన రామ్ అబ్బరాజు రూపొందించిన సినిమా ఇది. విడుదలకు కొన్ని రోజుల ముందు వరకు కూడా సినిమాకు అంతగా హైప్ లేదు. కానీ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రిలీజ్‌కు రెండు మూడు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ వేసింది చిత్ర బృందం. అది బాగానే పని చేసింది.
ముందే పాజిటివ్ టాక్, రివ్యూలు బయటికి రావడంతో తొలి రోజు మంచి బజ్‌తోనే సినిమా రిలీజైంది. ఇక గురువారం రిలీజ్ తర్వాత కూడా మంచి టాకే వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కూడా పరిస్థితులు కూడా బాగానే కలిసొచ్చి సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది. గతవారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు. అంతకుముందు వారం వచ్చిన ‘ఆదిపురుష్’ కథ ముగిసింది. ఇక ఈ వారం పోటీగా వచ్చిన ‘స్పై’ డివైడ్ టాక్ తెచ్చుకుంది.
వేరే రిలీజ్‌ల గురించి జనాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. రివ్యూలన్నీ కూడా 3కి అటు ఇటు రేటింగ్‌తో రావడంతో జనాల్లో సినిమా మీద పూర్తి సానుకూల భావన ఏర్పడింది. సినిమా చూసిన వాళ్లందరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. సినిమాలోని ‘జెర్సీ’ మూమెంట్ తరహా సీన్లకు సంబంధించిన థియేటర్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే లో బజ్‌తో మొదలైన ‘సామజవరగమన’ కాస్తా అన్నీ కలిసొచ్చి పెద్ద హిట్ దిశగా దూసుకెళ్తోంది.
This post was last modified on June 30, 2023 2:06 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…